డిక్లేర్ చేసారు: టాలీవుడ్ నెం.1 హీరో పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో అప్పటి వరకు నెం.1 స్థానంలో కొనసాగిన చిరంజీవి ఈ రంగం నుండి తప్పుకున్నాక నెం.1 స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆ స్థానం దక్కించుకునేది ఎవరు? అనే చర్చ గత కొంత కాలంగా కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్లుగా ఇద్దరు ముగ్గురు నెం.1 స్థానానికి పోటీ పడుతున్నారు. అయితే పవన్ కళ్యాణే ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నారు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన సినిమాలపై క్రేజ్ ఉండటమే ఇందుకు కారణం.
అయితే ఒకరి పేరు చెబితే మరొకరు ఫీలవుతారనే భయంతో ఇప్పటి వరకు దర్శకులు, నిర్మాతలు ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. అయితే నెం.1 స్థానం ఖాళీ అయిన చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ నెం.1 హీరోగా డిక్లేర్ చేస్తూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇటీవల జరిగిన ‘పిల్లా నువ్వేలేని జీవితం' ఆడియో వేడుకలో దిల్ రాజు ఈ ప్రకటన చేసారు.

సదరు హీరోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన సినిమా విడుదలయితే వచ్చే రెస్పాన్స్, ఓపెనింగ్ కలెక్షన్స్, జనాలు ఆయన సినిమా విడుదలైతే చాలు తప్పకుండా చూడాలనే ఉబలాటం కలిగి ఉండటం లాంటి అంశాలను పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణే నెం.1 అని చెప్పక తప్పదు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











