Pawan Kalyan: నా కొడుకుని అలా చూసి కంటతడి.. పవర్ స్టార్ మాతృమూర్తి ఎమోషనల్

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఎవ్వరు ఉండరు. మెగాస్టార్ చిరంజీవి తమ్మునిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస హిట్లతో పవర్ స్టార్ గా మారారు. హిట్టులు ప్లాపులు తో సంబంధం లేకుండా కోట్లాదిమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. నటుడుగా, సినీ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరించారు.ఆ తర్వాత ప్రజా సేవ చెయ్యాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మని స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. దీనికి సంబంధించిన ప్రోమోని జనసేన పార్టీ ఛానల్ లో రిలీజ్ చేసారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో బాక్సాఫీస్ రికార్డులు చేయడం నుంచి రాజకీయాల్లో చరిత్ర సృష్టించడం వరకు ఆయనో సంచలనం. ఇవి కేవలం మాటలు కాదు. పవన్ కళ్యాణ్ చేసి తన సత్తా ఎంటో నిరూపించారు. నేడు దేశ రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆంధప్రదేశ్ రాజకీయాల్లో ఓ కొత్త చరిత్ర రాశాడు. గతంలో ఎప్పుడు కూడా చూడని రాజకీయాలను తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. అసలు రాజకీయాలంటే మనకు ఎందుకు రా అనుకునే వాళ్లను సైతం ఇటు వైపు తిప్పాడు. పవన్ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Power Star Pawan Kalyan mother Anjanamma Interesting promo Released in Janasena Party channel Video Goes Viral

సినిమాల్లో స్టార్ డమ్ ఉన్నా.. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నా.. ఒక్కొక్క సినిమాకు కోటాది రూపాయలు పారిదోషికంగా తీసుకుంటున్నా.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు పది సంవత్సరాలు పడరాని కష్టాలు పడ్డారు. ఇలా రాజకీయాల్లో జీరో నుంచి హీరోకు మారి పెను సంచలనం సృష్టించారు. నిజంగా ఆయన పొలిటికల్ జర్నీ చాలా మందికి ఇన్‌స్పిరేషనల్‌.

ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మని 'అమ్మమనసు'తో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. దీనికి సంబంధించిన ప్రోమోని జనసేన పార్టీ ఛానల్ లో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో ' మీ ఇంటి చిన్నోడు.. రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అయ్యారు' అని యాంకర్ అనడంతో మెగా మదర్ అంజనమ్మ ఎమోషనలయ్యారు. పవన్ అన్నప్రసన కూడా అక్కడే అయ్యిందంటూ అంజనమ్మ తెలిపారు.

Power Star Pawan Kalyan mother Anjanamma Interesting promo Released in Janasena Party channel Video Goes Viral

చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో హైదరాబాద్ నుంచి వెళ్తుంటే జగ్గయ్యపేట వద్ద పోలీసులు అడ్డుకోగా అప్పుడు పవన్ రోడ్డు మీదే పడుకొని ప్రొటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనను యాంకర్ గుర్తు చేయడంతో 'పవన్ అలా రోడ్డు మీద పడుకున్నప్పుడూ చాలా బాధ కలిగిందమ్మ ' అంటూ ఎమోషనల్ అయ్యారు. 'పవన్ కు చిన్నప్పడు నుండి పట్టుదల ఎక్కువ. ఇది చేయాలంటే చేసేసేవాడు' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం 'అమ్మమనసు' స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి అంజనమ్మ ఎలాంటి విషయాలు చెప్పారోనని మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan janasena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X