పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్తా ఇది.. అజిత్ రికార్డ్ బ్రేక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై రాజకీయాలతో బిజీగా అయిపోయాడు. పవర్ స్టార్ గా తన సత్తా ఎప్పటికి నిలిచి ఉంటుందనేందుకు ఇది ఒక నిదర్శనం. ఏ ఏడాది ఆరంభంలో అజ్ఞాతవాసి చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి చిత్రం రూపొందడంతో విడుదలకు ముందే ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొన్నాయి. కానీ అజ్ఞాతవాసి చిత్రం నిరాశపరిచింది. అజ్ఞాతవాసి తరువాత పవన్ మరో సినిమాలో నటించలేదు. అజ్ఞాతవాసి చిత్రం ఇప్పటికి రికార్డుల వేట కొనసాగిస్తోంది.

అజ్ఞాతవాసి
తెలుగు చిత్రాలని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తుంటారు. తెలుగు చిత్రాలకు హిందీలో మంది క్రేజ్ నెలకొని ఉంది. హిందీలో డబ్ అయిన తెలుగు చిత్రాలకు మిలియన్ల కొద్దీ యూట్యూబ్ లో వ్యూస్ వస్తుండడం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా అజ్ఞాతవాసి చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు.

కేవలం 24 గంటల్లోనే
కేవలం 24 గంటల్లోనే అజ్ఞాతవాసి చిత్రం 9 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. అత్యధిక వ్యూస్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ సరసన ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.

అజిత్ రికార్డ్ బ్రేక్
24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ హిందీ దబ్ మూవీగా అజ్ఞాతవాసి రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు అజిత్ వివేగం చిత్రం పేరిట ఉండేది. వివేగం చిత్రం 24 గంటల్లో 5.5 మిలియన్ వ్యూస్ సాధించగా, అజ్ఞాతవాసి చిత్రం 9 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం.

అల్లు అర్జున్ సినిమాలు
అల్లు అర్జున్ సరైనోడు, డీజే వంటి చిత్రాలు యూట్యూబ్ లో 100 మిళియన్లపైగా వ్యూస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బన్నీ హిందీ డబ్బింగ్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో తెలుగు చిత్రాలకు హిందీలో మరింతగా మార్కెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











