ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పవన్ కల్యాణ్.. గాల్లో తేలిపోతూ.. వాహనంపై అలా రైడింగ్!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్‌ సంయుక్తంగా ప్రముఖ నిర్మాత బోనికపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వకీల్ సాబ్. హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రం ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతిహాసన్, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ఆనంద చక్రపాణి తదితరులు నటిస్తున్నారు. రిలీజ్‌కు సిద్దమైన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆ వివారాల్లోకి వెళితే..

అర్ధరాత్రి 12 గంటలకు పోస్టర్

అర్ధరాత్రి 12 గంటలకు పోస్టర్

వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను న్యూ ఇయర్ సందర్భంగా 12 గంటలకు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో విశేషంగా రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫోటోలో పవన్ కల్యాణ్, తన సహచరి శృతి హాసన్‌తో గాల్లో తేలినట్టుందనే విధంగా రోడ్డుపై దూసుకెళ్తున్నారు. ఈ ఫీల్‌గుడ్ పోస్టర్‌ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది.

సంక్రాంతికి టీజర్ రిలీజ్

సంక్రాంతికి టీజర్ రిలీజ్

గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు కొత్త సంవత్సరం సందర్భంగా శుభవార్తను అందించారు. సంక్రాతి పండుగ రోజున టీజర్‌ను అందిస్తున్నట్టు పోస్టర్‌లో వెల్లడించారు. దాంతో అభిమానుల్లో ఆనందాలు రేకెత్తాయి.

హెల్మెట్ లేకుండా వాహనంపై

హెల్మెట్ లేకుండా వాహనంపై

ఇక ఇప్పటి లానే పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసే వర్గం వకీల్ సాబ్ పోస్టర్‌పై ట్రోలింగ్‌ కూడా మొదలుపెట్టింది. గతంలో నల్ల కళ్లద్దాలు పెట్టుకొని పుస్తకం చదువుతున్నారంటూ ట్రోల్ చేసిన కొందరు.. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కామెంట్లు మొదలుపెట్టారు.

వేసవిలో ప్రేక్షకుల ముందుకు..

వేసవిలో ప్రేక్షకుల ముందుకు..

2020 వేసవిలో రీలీజ్ కావాల్సిన వకీల్ సాబ్ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో విడుదల వాయిదా వేశారు. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంతో వకీల్ సాబ్‌ను థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముుందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X