BRO టైటిల్ వెనక ఇంత పెద్ద కథ నడించిందా?.. వామ్మో త్రివిక్రమ్ మాములోడు కాదుగా.. పెద్ద చర్చే!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ 'బ్రో' సందడే కనిపిస్తోంది. వాట్సాప్ స్టేటస్ నుంచి ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ అంతా 'బ్రో' పోస్టర్, టీజర్స్, ట్రైలర్, సినిమాలోని సన్నివేశాలతో షేక్ అయిపోతున్నాయి. అయితే ఈ సినిమాకు మొదటగా 'బ్రో' టైటిల్ అనుకోలేదట. ఈ టైటిల్ పెట్టడానికి వెనక పెద్ద కథే జరిగింది. వివరాళ్లోకి వెళితే..

సందడే సందడి... :టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ - మెగా యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్ నటించిన చిత్రం 'బ్రో'. మెగా అభిమానులు, సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో థియేటర్ల వద్ద పవన్, మెగా ఫ్యాన్స్ తో సందడి వాతావరణం నెలకొంది. అ సినిమా బాగుందని అంటున్నారు. నెట్టింట్లో థియేటర్లలో తీసిన వీడియోలను, ఫొటోలను షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు.

Power Star Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Real Title is Kalapurushudu News Viral in Social Media

సాయితేజ్ నోట్.. :మరోవైపు ఈ సినిమా రిలీజైన సందర్భంగా సినిమాలో నటించిన సాయి తేజ్.. తన మావయ్య పవన్ కల్యాణ్ అంటే ఎంత ఇష్టమో మరోసారి తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ నోట్ కూడా విడుదల చేశారు. ఆయనే తన స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. తనకు ఈ అవకాశమిచ్చిన మూవీటీమ్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ జర్నీలో తనకు తోడున్న అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. ఇంకా పలు విషయాలను లేఖలో రాసుకొచ్చారు.

అంతా త్రివిక్రమే.. :ఈ సినిమాకు ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సముద్రఖనినే డైరెక్ట్ చేశారు. అయితే మాతృకను ఇక్కడి నేటివిటికీ తగ్గట్టు మార్చి స్క్రీన్ ప్లే, మాటలు అందించారు త్రివిక్రమ్. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించింది సముద్రఖనినే అయినప్పటికీ.. తెరవెనుక ఉంది నడిపించిందంతా త్రివిక్రమ్ అనేనని కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే 'బ్రో' సినిమా టైటిల్ గురించి కూడా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Power Star Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Real Title is Kalapurushudu News Viral in Social Media

అసలు టైటిల్ ఇదే.. :వాస్తవానికి ఈ సినిమాకు దర్శకుడు సముద్రఖని వేరే పెట్టాలని అనుకున్నారట. తన అభిప్రాయాన్ని తెలియజేశారట. 'కాలపురుషుడు' అనే టైటిల్ ను రాసుకొని ఇదే పెట్టాలని నిర్ణయించుకున్నారట. పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కు కూడా బాగానే నచ్చిందట. కానీ లాస్ట్ మూమెంట్ త్రివిక్రమ్ తన మనసులోని మాటను బయట పెట్టారట. టైటిల్ పవర్ ఫుల్ గానే ఉంది కానీ.. ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వదని చెప్పారట.

Power Star Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Real Title is Kalapurushudu News Viral in Social Media

అందుకే 'బ్రో'గా.. :ఈ చిత్రం ఎమోషన్స్ తో సాగే చిత్రం.. ఇలాంటి సినిమాకు పవర్ఫుల్ టైటిల్ పెడితే.. అంచనాలు పెంచినట్లు ఉంటుందని భావించి వద్దని త్రివిక్రమ్ అన్నారట. అందుకే సింపుల్ అండ్ స్టైలిష్ గా క్యాచీ పదాలు వచ్చేలా 'బ్రో' అనే టైటిల్ సూచించారట. దీనికి సముద్రఖని, సాయి తేజ్, పవన్ కల్యాణ్ కూడా ఓకే అన్నారట. అలా ఈ సినిమాకు 'కాలపురుషుడు' కాస్త 'బ్రో'గా మారిపోయింది. అంతకుముందు సాయితేజ్ ఈ టైటిల్ గురించి మాట్లాడుతూ.. 'సినిమా మొత్తం నేను మావయ్యను బ్రో అని పిలుస్తాను, ఆయన కూడా నన్ను బ్రో అనే పిలుస్తారు. అందుకే సినిమాకు బ్రో అని పెట్టాం' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X