అదీ 'బ్రో' పవన్ రేంజ్.. హాట్ కేకుల్లా ఓవర్సీస్ ప్రీమియర్ ప్రీ సేల్స్

మరో రెండు రోజుల్లో తెలుగు చిత్రసీమ బాక్సాఫీస్ ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 'బ్రో' చిత్రం రిలీజ్ కానుంది. అలానే ఓవర్సీస్ లో మరో రోజులో సినిమా విడుదల కానుంది. దీంతో అభిమానుల్లో ఫుల్ జోష్ పెరిగింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రీ సెల్స్ వివరాలు బయటకు వచ్చాయి. భారీగా జరుగుతున్నాయట. ఆ వివరాలేంటో చూద్దాం..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రిలీజ్ కానున్న మల్టీస్టార్ మూవీ 'బ్రో'. యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 28వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ప్రత్యేకంగా పవన్ ను దృష్టిలో పెట్టుకోని ఎంతో శ్రద్ధగా రాశారంట. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కూడా చెప్పారు. అయితే తనను దృష్టిలో పెట్టుకోని రాశారని ఏం చెప్పలేదు. అద్భుతంగా రాశారని చెప్పుకొచ్చారు.

Power Star pawan Kalyan Sai dharam tej Bro The Avatar Movie Overseas Premieres Pre-Sales business details

క్రమక్రమంగా బజ్: సాధారణంగా పవన్ సినిమా అంటే సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ ఉంటుంది. ఎక్కడ చూసిన ఆయనకు సంబంధించిన పాటలు వినపడుతుంటాయి.. పోస్టర్లు కనపడుతుంటాయి. కానీ ఈ సారి బ్రో సినిమాకు మొదట ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వలేదు. టీజర్, మొదటి రెండు సాంగ్స్ ఫ్యాన్స్ ను అంతగా ఆకట్టుకోలేదని ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ట్రైలర్, 'బ్రో' థీమ్ లిరికల్ వీడియో సాంగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'గుడుంబా శంకర్' లోని 'కిల్లి కిల్లి' సాంగ్ ప్రోమోతో సినిమాపై హైప్ బాగా క్రియేట్ అయింది.

Power Star pawan Kalyan Sai dharam tej Bro The Avatar Movie Overseas Premieres Pre-Sales business details

కథేంటంటే: ఈ సినిమాలో పవన్ టైమ్ అనే మోడ్రన్ గాడ్ పాత్రలో కనిపించనున్నారు. సాయి తేజ్ మార్క్ అనే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తంటే.. సాయి.. 'టైమ్ లేదు టైమ్ లేదు' అంటూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆఖరికి లవర్ తోనూ గడిపే సమయం లేకుండా బిజీగా గడుపుతుంటాడు. అయితే ఓ సారి అనుకోని ప్రమాదంలో చనిపోతే.. ఆ సమయంలో టైమ్ విలువ తెలియజేయడానికి పవన్ ఎంట్రీ ఇచ్చి.. సాయికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే కథాంశం.

Power Star pawan Kalyan Sai dharam tej Bro The Avatar Movie Overseas Premieres Pre-Sales business details

గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్: సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ చీఫ్ గెస్టులుగా హాజరై సందడి చేశారు. పవన్ కల్యాణ్, అలాగే ఆయన అభిమానులపై తమకున్న అభిమానాన్ని పంచుకున్నారు. సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తూ మూవీటీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈవెంట్ కు భారీగా అభిమానులు వచ్చి రచ్చ రచ్చ చేశారు.

Power Star pawan Kalyan Sai dharam tej Bro The Avatar Movie Overseas Premieres Pre-Sales business details

ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్: ఇకపోతే పవన్ కల్యాణ్ కు ఓవర్సీస్ లోనూ మంచి మార్కెటే ఉంటుంది. అక్కడ కూడా ఆయనకు భారీగానే అభిమానులు ఉన్నారు. దీంతో 'బ్రో' సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ సేల్స్ బాగా జరిగాయని తెలిసింది. ఇప్పటివరకు తాజాగా అందించిన సమాచారం ప్రకారం...యూఎస్ ఏలో 230 లొకేషన్స్ లో 710 షోలు ప్రదర్శన కానున్నాయి.

310, 140డాల్లర వసూళ్లు వచ్చాయని తెలిసింది. కెనడాలో 6లొకేషన్స్ లో 22 షోలు ప్రదర్శన కానుండగా... 27, 220డాలర్లు వచ్చాయట. ఇక యూకేలో 55 లొకేషన్స్ లో 87 షోలు వేయనున్నారు. 92, 963 పౌండ్లు కలెక్ట్ అయ్యాయని తెలిసింది. ఆస్ట్రేలియాలో 27 లొకేషన్లలో 87 షోలు ప్రదర్శన కానుండగా.. 35,430 డాలర్స్ కలెక్ట్ అయ్యాయట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X