పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే గుడ్ న్యూస్.. బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారుగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా డిఫరెంట్ సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాస్ దర్శకులను యువ దర్శకులతో ఎక్కువగా సినిమాలను చేసేందుకు ఆయన ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఓవర్గం ప్రేక్షకుల ఫోకస్ అయితే ఎక్కువగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ పైనే ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ మొదట పవన్ కళ్యాణ్ తో భవదియుడు భగత్ సింగ్ అనే సినిమాలో చేయాలని అనుకున్న విషయం తెలిసిందే.

అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు తేరీ కథను సరికొత్తగా ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇప్పుడు మరింత అంచనాలను పెంచేస్తోంది. తప్పకుండా ఫాన్స్ కు అయితే ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుంది అని దర్శకుడు నిర్మాతలు ఇదివరకే తెలియజేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.

ఇటీవల ఒక కీలకమైన షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. ఇక త్వరలోనే మొదటి షెడ్యూల్ కు సంబంధించిన కీలకమైన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.
అంటే స్పెషల్ ఫస్ట్ లుక్ టీజర్ లేదా గ్లింప్స్ లాంటిది విడుదల చేయవచ్చు అని సమాచారం. ప్రస్తుతం ఓ వర్గం ఫ్యాన్స్ లో అయితే ఈ సినిమాపై కాస్త అసంతృప్తి ఉన్న విషయం తెలిసిందే. అయితే వారికి కూడా ఆకట్టుకునే విధంగా దర్శకుడు హరీష్ శంకర్ మొదటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తిచేసి రెగ్యులర్ అప్డేట్స్ తో సాంగ్స్ తో కూడా మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఫ్యాన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











