'తస్వియా మైదాన్'ను రిజిస్టర్ చేయించిన పవన్ కళ్యాణ్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొమరంపులి పరాజయం తరవాత సమయం వృదా చేయకుండా వరస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆ క్రమంలోనే తాజాగా 'తీన్ మార్' విడుదలకు సిద్దం అవుతుంది. ఆ తరవాత తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో 'షాడో', అలాగే సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఫై హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' సినిమాలు చేస్తున్నాడు.
మరికోకొన్ని చిత్రాలు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినది 'తస్వియా మైదాన్' అనే సినిమా గురించి. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ పాపులర్ కొరియోగ్రాఫర్ హరీష్ పాయ్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కాకపోతే ఈ సినిమా కధ నాది, ఆ సినిమాను శ్రీ హరి తో చేయాలనుకుంటున్నానని ఇటివల మరో నృత్య దర్శకుడు శ్రీధర్ రెడ్డి వార్తలకెక్కాడు. తరవాత అప్పటికి సమస్య కాస్త చల్లబడ్డట్టు అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ 'తస్వియా మైదాన్' టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో తాను సినిమాను చేయాలని నిశ్చయించినట్టు నిర్ధారణ అవుతుంది. దాంతో ఇక ఫై ఈ వివాదం ఏ మలుపు తిరగనుందో అని పరిశ్రమ అంతా మౌనంగా గమనిస్తుంది. కాగా ఈ చిత్రం యొక్క మరో విశేషం ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ 'దొంగలముఠా" ఐదురోజుల షూటింగ్ లాగా, పవన్ కళ్యాణ్ తస్వియా మైదాన్ ను మూడు నెలల్లో, పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాట్టు సమాచారం. అయితే ఈ చిత్ర స్పెషాలిటి ఏమిటంటే ఇందులో సాంగ్స్ ఉండవు....


Click it and Unblock the Notifications











