పవన్ నిర్ణయంపైనే ‘గబ్బర్ సింగ్-2’: హరీష శంకర్
హైదరాబాద్ : పవర్ స్టార్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం గత రికార్డులన్నీ బద్దలు కొడుతూ నెం.1 కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. హిందీ 'దబాంగ్' చిత్రానికి ఇది రీమేక్. తాజాగా హిందీలో 'దబాంగ్-2' చిత్రం రూపొందుతుండటంతో....'గబ్బర్ సింగ్-2' చిత్రం కూడా వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
తాజాగా ఈ విషయమై గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఆయన తన ట్విట్టర్లో 'నేను గానీ, నిర్మాత బండ్ల గణేష్ గానీ ఎప్పుడూ గబ్బర్ సింగ్-2 గురించి మాట్లాడుకోలేదు. ఏదైనా పవర్ స్టారే డిసైడ్ చేస్తారు' అంటూ ట్వీట్ చేసాడు. 'గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్' అనే టైటిల్ తాము పరిశీలిస్తున్న వార్తల్లోనూ ఎలాంటి నిజం లేదన్నారు హరీష్ శంకర్.
ఇక హరీష్ శంకర్ సినిమాల విషయానికొస్తే..
గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఈ దర్శకుడు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ఓపెనింగ్ పూజా కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కార్యాలయంలో జరిగింది. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు.


Click it and Unblock the Notifications











