కావాలనే కొన్ని కాపీ సీన్లు పెట్టాం: ‘పవర్’ డైరెక్టర్

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవల విడుదలైన ‘పవర్' చిత్రంపై నాలుగైదు హిట్ సినిమాలను కలిపి తీసినట్లుందనే విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బుధవారం ఏర్పాటు చేసిన సినిమా సక్సెస్ మీట్లో ఈ విషయం ప్రస్తావించారు ఆ చిత్ర దర్శకుడు బాబీ. కావాలనే ఆ సీన్లు పెట్టినట్లు తెలిపారు.

‘కావాలనే అన్ని సక్సెస్ సినిమాల్లోని సీన్లన్నీ నా సినిమాలో ఉండాలని రాసుకున్నాను. వాటన్నింటికీ దగ్గరుండి తీర్చిదిద్ది ఎంత వరకు అవసరమో, అంత తీసుకోమని కోన వెంకట్ గారు సలహా ఇచ్చారు' అని దర్శకుడు బాబీ చెప్పుకొచ్చారు. సినిమా బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారని, చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అందరి సహకారం వల్లనే ఈ సక్సెస్ సాధ్యమైందని తెలిపారు.

స్లైడ్ షోలో...సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు...

రవితేజ మాట్లాడుతూ..

రవితేజ మాట్లాడుతూ..


బాబీ తొలి సినిమా హిట్టవ్వడం ఆనందంగా ఉంది. మొదటి సినిమాలోనే ఆర్థర్ విల్సన్, జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంసత పని చేసే అవకాశం బాబీకి వచ్చింది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అందరూ కష్టపడి పని చేసారు. ప్రకాష్ రాజ్ 103 జ్వరంతో సెట్‌‍కి వచ్చి సీన్ చేయడాన్ని మరిచిపోలేను. అందరం కష్టపడి పని చేసాం. బాబీకి మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు.

నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ..

నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ..


రవితేజ ఎనర్జీని క్యాష్ చేసుకునే సబ్జెక్టు ఇంకా రాలేదు. ఎవరైనా తెస్తే చేయడానికి నేను సిద్ధమే. సినిమా బోర్ లేకుండా ఎడిటర్ గౌతంరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రామ్ లక్ష్మణ్ పని తీరు చాలా బాగుంది. నటీనటులంతా బాగా చేసారు. ప్రకాష్ రాజ్ లేకుండా ఈ సినిమాను ఊహించలేం..సినిమాను హిట్ చేసిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..


రవితేజకు, నాకు మధ్య సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. నిర్మాత నాకు మంచి ఫ్రెండ్. పవర్‌తో పరిశ్రమకు స్వర్ణయుగం మొదలవుతుంది. ఆగడులో నేను లేను, కానీ తప్పక ఆడే సినిమా, గోవిందుడు అందరి వాడేలే, ఇతర సినిమాలు హిట్టవుతాయన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ...

కోన వెంకట్ మాట్లాడుతూ...


రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ....బాబీలో టాలెంట్ ఉంది. రవితేజ బాగా పాడాడు. తమన్ మ్యూజిక్ సూపర్. రవితేజ అభిమానులకు కావాల్సింది ‘పవర్' చిత్రంలో ఉంది. నిర్మాత తొలి వెంచర్ విజయవంతం అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X