‘పవర్’ యోగా ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఫిట్ నెస్: త్రిష
త్రిష ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పులి" చిత్రం తర్వాత నటిస్తున్న 'ఖుషీ ఖుషీగా" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్నారు. కాగా త్రిష తన బాడీ ఫిట్ నెస్ గురించి మాట్లాడుతూ...'నేను సినిమాల్లోకి వచ్చినప్పట్నుంచే సన్నగా ఉన్నాను. అయితే అప్పట్లో ఫిట్ నెస్ గురించి నాకేం తెలిసేది కాదు. స్లిమ్ గా ఉండటం ప్రధానం కాదు. ఫిట్ గా ఉండటమే ముఖ్యం అని తెలుసుకున్న తర్వాత వర్కవుట్లు మొదలు పెట్టాను. నా ఫిజికల్ ట్రైనర్ ఏం చెబితే అది చేసాను. నా అంతట నేనుగా తీసుకున్న డెసిషన్ పవర్ యోగా. అది మొదలు పెట్టిన తర్వాత నా శరీరాకృతిలో చాలా మార్పు వచ్చింది. ఈ మధ్య నన్ను చూసిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు అని అడిగితే 'పవర్ యోగా ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ ఫిట్ నెస్" అని చెబుతున్నాను అంటూ తన ఫిట్ నెస్ గురించి వివరించారు.
త్రిష పవన్ కళ్యాణ్ ఖుషిగా లవ్ ఆజ్ కల్ పులి జయంత్ సి పరాన్జీ గణేష్ బాబు trisha pawan kalyan khushiga love aaj kal puli jayant c paranji ganesh babu


Click it and Unblock the Notifications