ఉరికంబం ముందు సైరా, అద్భుతమైన డైలాగ్ లీక్.. చిరంజీవికి కోపం వస్తుందేమో!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోరాట యోధుడిగా చిరు యాంగ్రీ లుక్ లో అదరగొట్టాడు.

పరుచూరి బ్రదర్స్
పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి రచయితలుగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం గురించి అధ్యనం చేసి ఈ కథని రూపొందించారు.

డైలాగ్ లీక్
ఈ చిత్రంలో కీలక సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పే డైలాగ్ ని పరుచూరి గోపాల కృష్ణ లీక్ చేశారు. చేతులు విరిచేశాం.. ముఖం ముందు ఉరితాడు ఉంది.. ఏంట్రా ఆ ధైర్యం అని విలన్ అంటే.. చచ్చి పుట్టిన వాడిని.. చనిపోయిన తరువాత కూడా బ్రతికే వాడిని.. చావంటే నాకెందురా భయం అని చిరంజీవి అంటారు.

సంతోషంతో
సంతోషాన్ని ఆపుకోలేక అభిమానులతో ఈ డైలాగ్ పంచుకోవాలనిపించింది పరుచూరి అన్నారు. అందుకే లీక్ చేస్తున్నా. చిరంజీవికి కోపం వస్తుందేమో అని అన్నారు.

భారీ బడ్జెట్
సైరా చిత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 2006 లోనే ఈ చిత్రం తెరకెక్కాల్సింది. కానీ ఇప్పటికి కుదిరింది అని పరుచూరి అన్నారు. భారీ పోరాట సన్నివేశాలతో హోలీవడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











