»   » వెయ్యి మందితో అల్లు అర్జున్ కి 'ఇంటర్వెల్'

వెయ్యి మందితో అల్లు అర్జున్ కి 'ఇంటర్వెల్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాజాగా అల్లు అర్జున్‌ సినిమాకీ ఇంట్రవెల్ సీన్ ని తెరకెక్కించారు బోయపాటి శ్రీను. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. నగర శివార్లలో వేసిన ఓ భారీ సెట్‌లో అల్లు అర్జున్‌, శ్రీకాంత్‌, రకుల్‌, కేథరిన్‌... వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో ఇంట్రవెల్ కి ముందొచ్చే ఓ ఫైట్ సీన్ ని తెరకెక్కించారు. ఈ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్.

నిర్మాత మాట్లాడుతూ..''ఈ చిత్రంలో యాక్షన్‌ సీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. కొత్త తరహా ఫైట్స్ తెరపై చూడొచ్చు. రామ్‌లక్షణ్‌, రవివర్మలు కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ని తెరకెక్కించాం. కీచ మాస్టర్‌ నేతృత్వంలో ఓ పోరాటాన్ని షూట్ చేయాల్సి ఉంది'' అని అన్నారు.

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'సరైనోడు' అనే పేరు పరిశీలనలో ఉంది. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Powerful Interval Scene for Allu Arjun

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం. బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు'' అని తెలిపారు.

ఇక మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను కావటంతో వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

English summary
A powerful interval lead scene has successfully been shot on Allu Arjun, Srikanth, Rakul Preet Singh, Catherine and 1000 junior artists in a specially erected set on the outskirts of Hyderabad city.
Please Wait while comments are loading...