twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కింగ్ మేకర్' గా చిరంజీవి.. 'అన్న' వద్దనుకుని మరీ, పెద్ద స్కెచ్చే ఉన్నట్టుందే?

    |

    కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు అనౌన్స్ చేశారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలిపోయింది. త్వరలో షెడ్యూల్ ప్రారంభించి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవి సినిమాల లైనప్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఆయన లైన్ అప్ లో ఒక తమిళ రీమేక్ సినిమా, ఒక మలయాళ రీమేక్ సినిమా ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమా ఉన్నాయి. అయితే ఈ మూడు సినిమాల్లో కూడా ఆయన మలయాళ రీమేక్ సినిమా మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

    టైటిల్ కోసం మొదలయిన తంటాలు

    టైటిల్ కోసం మొదలయిన తంటాలు

    మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు దర్శకుడిగా ముందు చాలా మంది పేర్లు వినిపించాయి. సాహో సుజిత్ మొదలు వి.వి.వినాయక్ లాంటి పేర్లు వినిపించినా చివరికి మోహన్ రాజాకు ఈ సినిమా దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అయితే పూర్తిగా మలయాళం నేపథ్యంలో ఉన్న ఈ సినిమాను తెలుగు నేపథ్యంలోకి తీసుకురావడానికి మోహన్ రాజా చాలానే కష్టపడ్డారు. అంతా పూర్తి అయిన క్రమంలో ఇప్పుడు ఈ సినిమా కోసం ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుంది అనే చర్చ జరుగుతోంది.

    ఒరిజినల్ కథ ప్రకారమే టైటిల్

    ఒరిజినల్ కథ ప్రకారమే టైటిల్

    ఒరిజినల్ కథ ప్రకారం సినిమాలో మోహన్ లాల్ ఒక కింగ్ మేకర్ లాంటి పాత్ర పోషిస్తాడు. తాను కింగ్ అయ్యే అవకాశం ఉన్నా అవ్వకుండా తన తమ్ముడిని కింగ్ స్థానంలో కూర్చోబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా దాదాపు అలాగే ఉంటుందని కానీ తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అందులో ఒకటి కింగ్ మేకర్ కాగా రెండవది అన్న. ఒక రకంగా మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్ర చాలా పేరు తెచ్చుకుంది. పెద్దగా మాట్లాడకుండా గంభీరం గా ఉంటూ మోహన్ లాల్ సెటిల్డ్ పర్ఫామెన్స్ చేశారు. ఇప్పుడు అదే పాత్రను చిరంజీవి చేస్తూ ఉండడంతో ఈ రెండు టైటిల్స్ బాగుంటాయని భావిస్తున్నారట.

     చిరంజీవికి అదే నచ్చిందట

    చిరంజీవికి అదే నచ్చిందట

    అయితే చిరంజీవి మాత్రం ఇందులో అన్న అనే టైటిల్ కంటే కింగ్ మేకర్ అనే టైటిల్ కి ఎక్కువ మార్కులు వేశారట. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు కింగ్ మేకర్ అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా హక్కులు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కొన్నారు. దీంతో ఈ సినిమాను కూడా రామ్ చరణ్ ఎన్ వీ ప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్నారు..అయితే మరి చివరికి కింగ్ మేకర్ అనే టైటిల్ ఉంచుతారా లేక మరేదైనా టైటిల్ తర్వాత తీసుకు వస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.

    Recommended Video

    Uppena Movie Team Best Wishes To Kottaga Rekkalochena
    చిరంజీవికి చెల్లెలు కావలెను

    చిరంజీవికి చెల్లెలు కావలెను

    ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో నయనతార నటిస్తుందని ముందునుంచే ప్రచారం జరిగింది, అయితే తాజాగా ఆ సినిమాలో తాను చేయలేని నయనతార తప్పుకున్నట్లు ప్రచారం మొదలైంది. డేట్స్ కుదరని కారణంగా ఆమె సినిమా చేయలేనని చెప్పినట్లు సమాచారం. దీంతో సినిమా యూనిట్ చిరంజీవి చెల్లెలి పాత్రలో సరిగ్గా సరిపోయే నటి ఇంకా ఎవరు ఉన్నారు అనే వేటలో పడ్డారు. ఆచార్య షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ లోపుగా నయనతార తప్పుకున్న పాత్రకు ఒక మంచి నటిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు.

    English summary
    Chiranjeevi's next project soon after Acharya which is going to be the much awaited official Telugu remake of the Malayalam blockbuster movie Lucifer. director Mohan Raja is currently working on post production. Some titles are speculated for this movie. recently two more titles added to the list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X