డబ్బింగ్ సినిమాల బ్యాన్ పై అల్లు శిరీష్
డబ్బింగ్ చిత్రాలు బ్యాన్ చేయాలనే విషయమై గత కొద్ది రోజులుగా నిర్మాతల మండిలి వారు ప్రతీ టీవీ ఛానెల్ లోనూ కూర్చుని చర్చలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ చిత్రాల డబ్బింగ్ బ్యాన్ చేయాలని, భారతీయ చిత్రాల డబ్బింగ్ ప్రింట్లని యాభైకి పరిమితం చేయాలని వారు డెషిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. అలాగే ఈ బ్యాన్ అంతా కేవలం చిన్న సినిమాని బ్రతికించటానికే అని నమ్మబలకుతున్నారు. ఈ విషయమై అల్లు శిరీష్ తాజాగా ట్విట్టర్ లో స్పందిస్తూ...ప్రతీ చిత్రమూ..దాని సొంత మెరిట్ పై ఆడుతుంది.
అలాగే ప్రేక్షకులు..డబ్బింగ్ లేదా హాలీవుడ్ చిత్రాలు మాత్రమే చూస్తాం..లోకల్ సినిమాలను వదిలేస్తాం అనటంలేదు. కాబట్టి డబ్బింగ్ సినిమాలను రిస్ట్రిక్ట్ చేయటం గానీ, బ్యాన్ చేయటం గానీ చెయ్యనవసరం లేదు అన్నారు. అలాగే అరుంధతి చిత్రం తమిళంలో డబ్బింగై మంచి హిట్ అయిందని చెప్పారు. అలాగే ప్రేక్షకులు తాము ఏ చిత్రం చూడాలో ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. అంటే అల్లు శిరీష్ చెప్పేది ఏమిటంటే సినిమా బాగుంటే జనం చూస్తారు. అంతేగాని డబ్బింగ్ సినిమాలు బంద్ చేసి మరీ తెలుగు సినిమాలు మాత్రమే ఏది పడితే అది జనం చూడరని చెప్తున్నారు. త్వరలో మగధీర తమిళ వెర్షన్ రిలీజవుతోంది.


Click it and Unblock the Notifications











