నా సోల్ మేట్ ఆ హీరోనే...రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ తన సోల్ మీట్ ఎవరనేది వివరించారు. ఆ వ్యక్తి మరెవరో కాదు ప్రభాస్. ప్రబాస్ కి గతంలో ఛత్రపతి వంటి హిట్ ఇచ్చిన రాజమౌళి మళ్ళీ అతనితో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ కామెంట్స్ చేసారు. ఆయన మాటల్లోనే...రెండు రోజులు పాటు వరసగా నేను ప్రభాస్ కలిసి చర్చించారు. అతని వంటి లాజికల్ ధింకింగ్ పర్శన్, లెవిల్ హెడ్ పర్శన్ ని నేను ఇంతకుముందు కలవలేదు. మా కేరీర్ లు వేరు కావచ్చు గానీ అతను నా సోల్ మేట్ అన్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో రెడీ అయిన మర్యాదరామన్న ప్రమోషన్ వర్క్ జరగుతోంది. ఈ చిత్రం అనంతరం ప్రభాస్ తో ఆయన సినిమా చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











