సాహో ప్రీ రిలీజ్ రివ్యూ: బాహుబలి తర్వాత గ్రాండియర్‌గా.. ప్రభాస్, శ్రద్దా కెమిస్ట్రీ కేక
సాహో చిత్రం సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. బాలీవుడ్‌కు చెందిన శ్రద్దాకపూర్, జాకీ ష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే తదితరులు నటించారు. అలాగే మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి తెలుగు నటీనటులు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యారు. సాహో చిత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ అనడానికి ఈ క్రింది అంశాలు పక్కాగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రన్ రాజా రన్ సినిమాతో పరిచయమైన దర్శకుడు సుజిత్ రెడ్డి ఈ సారి భారీ బడ్జెట్ చిత్రంతో దేశవ్యాప్తంగా మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు. వివరాల్లోకి వెళితే...

ప్రభాస్, శ్రద్దాకపూర్ కెమిస్ట్రీ
సాహో చిత్రంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ కెమిస్ట్రీ ఇప్పటికే మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య యాక్షన్ సన్నివేశాలే కాకుండా రొమాంటిక్ సీన్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. విదేశాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన పాటలు అభిమానులనే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఇక తెరపై ఈ పాటలు మ్యాజిక్ చేయడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

అత్యధిక వ్యయంతో యాక్షన్ సీన్లు
సాహో సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను రూ.90 కోట్లతో అబుదాబీలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయికి తగినట్టుగా అంత భారీ ఎత్తున్న స్టంట్స్‌ను చిత్రీకరించడం సినీవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా సాహో ఇంటర్వెట్ సీన్‌ను అత్యంత భారీగా చిత్రీకరించడం మరోసారి చర్చకు దారి తీసింది. ప్రస్తుతం సాహో చిత్ర పోరాట సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం చిత్రీకరించే సనివేశాల కోసం రూ.30 కోట్లు ఖర్చు చేశారు.

అద్భుతమైన సాంకేతిక టెక్నాలజీతో
హాలీవుడ్‌లో ఛేజింగ్ సీక్వెన్స్‌లో విపరీతంగా వాడే బైక్ ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్. అనేక సాంకేతిక మార్పులతో ఈ బైక్‌ను సాహో చిత్రంలో వాడారు. 765 సీసీ లైన్ త్రీ సిలెండర్ ఇంజిన్ ద్వారా ఈ బైక్‌కు పవర్ సప్లై అవుతుంది. 121 బీహెచ్‌పీతో 11700 ఆర్పీఎం, 77ఎన్ఎం పీక్ టార్క్‌తో 10800 ఆర్పీఎం దీని ప్రత్యేకతలు. ప్రభాస్ వాడిన ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధర కూడా కాస్త ఎక్కువే. టాప్ లైన్ మోడల్ ధర రూ.10.55 లక్షలు (ఎక్స్ షో రూమ్ ధర).

ప్రత్యేకంగా కార్లు, ట్రక్కులు డిజైన్లు
యాక్షన్ సీన్ల కోసం ప్రత్యేకంగా కార్లు, ట్రక్కులు డిజైన్ చేశారు. కేవలం చేజింగ్, బ్లాస్టింగ్ సీన్ కోసం ఒకే రకమైన మూడు కార్లను తయారు చేశారు. ఒకవేళ ఒక షాట్ సరిగా రాకపోతే మరో కారును, అది కాకపోతే మరో కారును బ్లాస్టింగ్‌కు ఉపయోగించేందుకు మూడు కార్లను షూటింగ్‌కు అందుబాటులోకి తెచ్చారు. వీటి ఖరీదు 3 కోట్ల రూపాయాలు. ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌ను మిషన్ ఇంపాసిబుల్ 2లో ఉపయోగించారు.

స్పెషల్‌గా రిమోట్ కార్లు
సాహో కోసం తొలిసారి రిమోట్‌తో నడిచే కార్లను వాడారు. రిమోట్‌తో నడిచే కార్లను ఉపయోగించడం టాలీవుడ్‌లో మొట్టమొదటిసారి యాక్షన్ సీన్లలో క్రాష్ అయినప్పుడు ప్రాణనష్టం కలుగకుండా కేవలం రిమోట్ కార్లను వాడారు. కెన్నీబైట్స్ కోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి కెమెరాలను చిత్ర యూనిట్ తెప్పించింది.

సెన్సార్ సర్టిఫికెట్, నడివి
సాహో చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం సాహో నిడివి 171.52 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంటలపాటు. అత్యంత సాంకేతిక విలువలతో హలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా రూపొందిన ఈ చిత్రం అభిమానులకు పండుగ వాతావరణం తెచ్చే పరిస్థితి ఉంది.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక రిలీజ్‌కు ముందు ప్రభాస్ సాహో మరో రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా బిజినెస్ రూ.332 కోట్ల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నైజాంలో రూ.40 కోట్లకు, సీడెడ్‌లో రూ.25 కోట్లు, నెల్లూరులో 4.50 కోట్లు, గుంటూరులో 12.50 కోట్లు, కృష్ణాలో రూ.8 కోట్లు, పశ్చిమ, తూర్పు గోదావరి రూ.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.16 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కలిపి రూ.18 కోట్లతో దేశవ్యాప్తంగా హిందీ హక్కులు రూ.120 కోట్ల మేర బిజినెస్ చేయడం జరిగింది. ఇండియాలో మొత్తంగా 290 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.42 కోట్లతో మొత్తంగా 332 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ లెక్క తేలినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











