ఈటీవి ప్రభాకర్ ప్రేమలో పడ్డాడట. టీవీ యాంకర్ గా కొనసాగుతున్న ఈయన ఇటీవల మైసమ్మ ఐపీయస్ సినిమాలో నటించాడు. ఆ సినిమా హీరోయిన్ ముమైత్ ఖాన్ ప్రేమలోనే ప్రభాకర్ పడ్డట్టు తెలుస్తోంది. ముమైత్ ఖాన్ పేరును ఇటీవల ఒకటే పలవరిస్తున్నాడట. అంతేకాదు ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ముమైత్ ఖాన్ తో కలిసి నృత్యం చేశాడు. ముమైత్ దూరంగా ఉండి డాన్స్ చేస్తుంటే ఇతగాడేమో ఆమె దరికి చేరడానికి ప్రయత్నించాడు. ప్రభాకర్ ప్రేమ కూడా అంతేనా కాదా అన్నది మున్ముందు తెలుస్తుంది.
Story first published: Thursday, July 16, 2026, 22:55 [IST]