India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కలెక్టర్ భార్య కావలసిన సురేఖ లైఫ్ మార్చేసిన నటుడు.. ఆ ఒక్క సలహాతో చిరంజీవికి భార్యగా!

  |

  మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతుల అన్యోన్య దాంపత్యం గురించి తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాక ప్రేక్షకులు కూడా బాగా తెలుసు. అయితే నిజానికి వీరి వివాహం ఒక ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిందని తాజాగా వెల్లడైంది.. నిజానికి సురేఖకు పెళ్లి చేయాలి అని అల్లు రామలింగయ్య ఆలోచిస్తున్న సమయంలో రెండు సంబంధాలు మంచిగా కనిపించాయని అయితే అందులో చిరంజీవిని ఎంపిక చేయడం వెనుక ఒక నటుడి సలహా ఉందనే విషయం తాజాగా తెరమీదకు వచ్చింది. ఆ నటుడు ఎవరు? ఆయన ఏమని సలహా ఇచ్చారు? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  చిరంజీవి స్టార్ హీరో కాకముందే, ఒకరకంగా స్టార్ హీరో అనే కాదు నటుడిగా కనీస గుర్తింపు కూడా రాకముందే అల్లు రామలింగయ్య చిరంజీవిని తన అల్లుడిగా చేసుకున్నాడు. నిజానికి సురేఖ మెడలో చిరంజీవి తాళి కట్టే సమయానికి చిరంజీవి హీరో కాలేదు. చిన్నాచితక పాత్రలు చేస్తూ ఎలా అయినా నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి 1978 సంవత్సరంలో విడుదలైన ప్రాణం ఖరీదు అనే సినిమాతో నటుడిగా మారారు. ఆయన నటించిన మొదటి సినిమా పునాది రాళ్లు అయినా సరే ప్రాణం ఖరీదు సినిమా ముందుగా విడుదలైంది.

  Prabhakar Reddys wife Interesting comments on Chiranjeevis wedding in her recent interview.

  అయితే చిరంజీవి చిన్నాచితక పాత్రలు చేస్తున్న సమయంలోనే ఆయనలో ఉన్న నిజాయితీ, కష్ట పడే వ్యక్తిత్వం, టాలెంట్ చూసిన అల్లు రామలింగయ్య చిరంజీవిని తన అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నాడట. ఏనాటికైనా ఆయన స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉన్న అల్లు రామలింగయ్య చిరంజీవిని పిలిపించి తన కుమార్తెను వివాహం చేసుకుంటావా అని అడిగారట. అప్పటికే అల్లు రామలింగయ్య టాలీవుడ్ లో ఒక స్టార్ కమెడియన్, సూపర్ క్రేజ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. గీతా ఆర్ట్స్ పేరుతో అప్పటికే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా మొదలుపెట్టి సినిమాలు నిర్మించడం ప్రారంభించారు.

  చిరంజీవి అప్పటి స్థితిగతులతో పోల్చుకుంటే అల్లు రామలింగయ్య కుమార్తె వివాహం చేసుకోవడం తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అనుకున్నారు. దీంతో ఆయన ఆనందంగా వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అయితే చిరంజీవిని పిలిపించి వివాహం చేసుకుంటావా అని అడిగారు కానీ అల్లు రామలింగయ్యను మరో సందేహం పీడించేదట. ఇంకా హీరోగా కూడా నిలదొక్కుకోని వ్యక్తికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయడం కరెక్ట్ ఏనా అని ఆయన ఆలోచిస్తూ ఉండేవారట. ఎందుకంటే అప్పటికే సురేఖని వివాహం చేసుకోవడం కోసం ఒక కలెక్టర్ కూడా సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ సంబంధం చేయాలా హీరోగా ప్రయత్నాలు చేస్తున్న ఈ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో తనకు అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి అయిన ప్రభాకర్ రెడ్డిని అల్లు రామలింగయ్య కలిశారట.


  మా కుమార్తె పెళ్లి విషయంలో ఏ విషయం తేల్చుకోలేక పోతున్నాను, ఇలా రెండు సంబంధాలు వచ్చాయి చిరంజీవిని అడిగితే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, కలెక్టర్ సంబంధం కూడా రెడీగా ఉంది ఇద్ద లో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది అనే విషయం తేల్చుకోలేక పోతున్నాను సలహా ఇవ్వమని అడిగారట. దీంతో వెంటనే ప్రభాకర్ రెడ్డి పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం, ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత పెద్ద ఇంటికి పంపించినా ఆమె అక్కడ సంతోషంగా అయితే ఉండదు. అందుకే సురేఖని అడిగి ఆమె ఇష్ట ప్రకారం వివాహం చేయమని కోరారట.

  ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు అల్లు రామలింగయ్య తన కుమార్తెను అడుగగా ఆమె చిరంజీవి పెళ్లి చేసుకుంటాను అన్నారట. అప్పటికే సురేఖ మన ఊరి పాండవులు అనే సినిమా ప్రివ్యూ సమయంలో చిరంజీవిని నేరుగా చూసి ఉండటంతో ఆమె పెద్దగా అడ్డంకులు లేకుండా పెళ్లి చేసుకుంటా అన్నారు. అలా వారి వివాహం జరిగిపోవడం, ఆ తర్వాత అల్లు రామలింగయ్య కారణంగా చిరంజీవికి అనేక ఆఫర్లు రావడం, ఆ ఆఫర్లతో తన టాలెంట్ ను బయటపెట్టి అద్భుతమైన విజయాలని అందుకోవడం జరిగిపోయాయి. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి భార్య తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇప్పటికే ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలిసినా ఇప్పుడు మరోసారి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Prabhakar Reddy's wife Interesting comments on Chiranjeevi's wedding in her recent interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X