షాక్ ఇస్తున్న ప్రభాస్ ‘మిర్చి’ భారీ కటౌట్స్ (ఫోటోలు)
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్‌కి ప్రభాస్ అంటే మహా క్రేజీ. ప్రభాస్‌లా సాలిడ్‌గా, స్టైలిష్‌గా ఉండాలని తాపత్రయ పడుతుంటారు. తమ అభిమాన హీరో ప్రభాస్ 'మిర్చి' మూవీ ఈ రోజు విడుదలైన నేపత్యంలో రాష్ట్రంలోని 'మిర్చి' థియేటర్లన్నీ భారీ కటౌట్లతో నిండిపోయాయి.
అయితే భీమవరంలోని ప్రభాస్ అభిమానులు మిర్చి భారీ కటౌట్లు కట్టి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రభాస్ హైటుకు తగిన విధంగా సాలిడ్ గా ఉండే భారీ కటౌట్లను కట్టి అందరి ఆశ్చర్య పరిచారు. ఇందులో ఒకటి 150 అడుగుల వెడల్పుతో ఉండగా, మరొకటి 70 అడుగుల పొడవుతో కేక పెట్టిస్తున్నాయి.
కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

భీమవరంలో 150 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన మిర్చి కటౌట్.

70 అడుగుల పొడవుతో ఏర్పాటు చేసిన మిర్చి కటౌట్.

మిర్చి స్టిల్స్.

మిర్చి స్టిల్స్.

మిర్చి స్టిల్స్.


Click it and Unblock the Notifications











