సలార్ సినిమా కోసం రెండు నెలలు కష్టపడితే చాలట
రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ అనే కొత్త సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. అయితే సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుంది అనేది బిగ్గెస్ట్ సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తెస్తాడనేది తెలియదు.
అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ప్రభాస్ కు సంబంధించిన సన్నివేశాలను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేస్తారని తెలుస్తోంది. ముందుగా రాధేశ్యామ్ సినిమాని పూర్తి చేసి గ్రాండ్ హిట్ కొట్టాలని అనుకుంటున్న రెబల్ స్టార్ ఆదిపురుష్ షూటింగ్ కు కూడా రెడీ అవుతున్నాడు. ఇక సలార్ సినిమా కోసం ప్రభాస్ కేవలం 60 నుంచి 70 రోజుల కాల్షీట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
PICS: Srilanka Actress Piumi Hansamali Photos goes viral on internet Photos

ప్రస్తుతం సలార్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు బిజీగా ఉన్నాడు. మరోవైపు KGF పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా పూర్తి స్థాయిలో సలార్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇక KGF పనులాన్ని పూర్తయిన తరువాత సలార్ రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ పెంచనున్నట్లు సమాచారం.
మరి ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాలో ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











