ప్రభాస్ 20 ఫస్ట్ లుక్: అనుకున్నదే నిజమైంది.. పూజా హెగ్డేతో ప్రభాస్ రొమాంటిక్ స్టిల్
గత ఏడాది నుంచి రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ ఎట్టకేలకు రిలీజయ్యింది. ఆలస్యం చేసి అభిమానులను ఇన్నాళ్లు కాస్త అసహనానికి గురి చేసిన యూవీ క్రియేషన్స్ మొత్తానికి ఫస్ట్ లుక్ తో మంచి కిక్కిచ్చింది. ఇక అందరూ ఊహించినట్టుగానే సినిమాకు రాధేశ్యామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఫస్ట్ లుక్ వైరల్..
గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఫస్ట్ లుక్ లో యూరప్ కంట్రీ తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ తో చిత్ర యూనిట్ బలమైమ సందేశం ఎదో ఇచ్చిందనే భావన కలుగుతోంది.

కథకు తగ్గట్టు టైటిల్
పూజా హెగ్డే కాస్ట్యూమ్ మయంగా ఫస్ట్ లుక్ కలర్ఫుల్ గా వెలిగిపోతోంది. ఇక ప్రభాస్ జెంటిల్ మెన్ లుక్ లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మునుపెన్నడు లేని విధంగా ప్రభాస్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఆకట్టుకునే ఛాన్స్ ఉన్నట్లు అర్ధమవుతోంది. 1960 -70ల కాలంలో ఈ సినిమా కథ కొనసాగుతుందట. ఇక కథ పాత్రలకు తగ్గట్టుగా సినిమా టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

బలమైన బాక్సాఫీస్ హిట్ కొట్టాలని..
సాహో సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో బలమైన బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ఇక అభిమానుల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదట సినిమాకు జాను అనే టైటిల్ ని అనుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఓ డియర్ అనే టైటిల్ ని కూడా అనుకున్నారు. ఇక ఫైనల్ గా రాధేశ్యామ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.
Recommended Video

ఎలాంటి విజయాన్ని అందుకుంటారో..
ఇక సినిమాకు సంబంధించిన పూర్తి యూనిట్ పై ఇంకా ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. గోపికృష్ణ బ్యానర్ తో కలిసి యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. కృష్ణం రాజు కూతురు ప్రసీదా ఉప్పలపాటి కూడా ఈ సినిమా ప్రొడక్షన్ లో వర్క్ చేయడం విశేషం. మొత్తానికి ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











