ప్రభాస్ 20 అప్‌డేట్: ముగించిన ప్రభాస్.. షూటింగ్ పరిస్థితి ఎలా ఉందంటే!

సాహో తర్వాత ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమాగా రాబోతున్న కొత్త సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. హై రేంజ్ బడ్జెట్‌తో యంగ్ రెబల్ స్టార్ కెరీర్‌లో మరో భారీ సినిమాగా ఈ మూవీ రూపొందుతోందని తెలియడంతో సినిమా పట్ల మరింత ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా పుర్తిచేసుకుందట.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో ప్రభాస్, పూజా హెగ్డేపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ ఒక్క సెట్ కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో మరో షెడ్యూల్ కోసం రెడీ అవుతోందట చిత్రయూనిట్. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి మూడో షెడ్యూల్స్ పూర్తయ్యాయి. నాలుగో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభాస్ ఓ వారం రోజులపాటు రెస్ట్ తీసుకోనున్నాడని తెలుస్తోంది.

 Prabhas 20 Shooting Update: Hyderabad schedule Finish

గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. కమల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండడం విశేషం.

ప్రమోద్, వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి 'జాన్' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X