జాన్ అప్‌డేట్: ప్రభాస్ తల్లిగా టాప్ హీరోయిన్..
ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి' లాంటి భారీ సినిమా తర్వాత సాహో రూపంలో ఊహించని డిజాస్టర్ వచ్చిచేరింది. దీంతో ఆ విషయాన్ని మరిపించేలా మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు యంగ్ రెబల్ స్టార్. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ (వర్కింగ్ టైటిల్) సినిమా సెట్స్ పైకి వచ్చేశారు ప్రభాస్.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించేందుకు గాను ఓ టాప్ హీరోయిన్‌ని తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీని ప్రభాస్ తల్లిగా యాక్ట్ చేయిస్తున్నారు మేకర్స్. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ అయిన ఈమె 'ప్రేమ పావురాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన 'రాణా'లో భాగ్యశ్రీ నటించింది. మళ్లీ ఇంతకాలం ఇలా ప్రభాస్ తల్లిగా ప్రేక్షకుల ముందుకు రానుంది భాగ్యశ్రీ.
గత వారం రోజుల నుంచి జరుగుతున్న షూటింగ్‌లో ప్రభాస్, భాగ్యశ్రీనలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. బుధవారంతో భాగ్యశ్రీకి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ విడుదల విడుదల కాబోతున్న 'జాన్' మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











