ప్రభాస్ 21 సర్ ప్రైజ్: అనుకున్నదే నిజమైంది.. ప్రభాస్ కోసం బాలీవుడ్ బ్యూటీ!
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాతో సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా మన టెక్నీషియన్స్ నేషనల్ లెవెల్లో ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతి ప్రొడక్షన్ లో ప్రభాస్ 21 పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన బిగ్ సర్ ప్రైజ్ ని అందించింది చిత్ర యూనిట్.

నేషనల్ లెవెల్లో వైరల్ అయ్యేలా..
వైజయంతి మూవీస్ మొదటి నుంచి ప్రభాస్ 21 సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని హైలెట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. స్క్రిప్ట్ సిద్దమైనప్పటి నుంచి ప్రభాస్ ఒకే చెప్పేంత వరకు కూడా ప్రాజెక్టు నేషనల్ లెవెల్లో వైరల్ అయ్యేలా చేశారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాని కూడా చెప్పేశారు.

హీరోయిన్ దీపికా పదుకొనె
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ 21వ ప్రాజెక్టులో హీరోయిన్ దీపికా పదుకొనె అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఒక వీడియో ద్వారా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చి రూమర్స్ కి ఎండ్ కార్డ్ పెట్టారు. అసలైతే ఈ విషయంలో చాలా రోజులుగా అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

రూమర్స్ కి తెర దించుతూ..
దీపికా పదుకొనె ప్రభాస్ తో నటించబోతుందని ముందు నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే మళ్ళీ ఆ మధ్య ఎందుకో ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్ల వైజయంతి మూవీస్ మరొక హీరోయిన్ కోసం వెతుకుతున్నట్ల టాక్ వచ్చింది. ఇక ఆ రూమర్స్ కి తెర దించుతూ వైజయంతి వీడియో వదిలింది.
Recommended Video

సర్ ప్రైజ్ అనగానే..
నిన్న వైజయంతి మూవీస్ ఒక సర్ ప్రైజ్ ఇస్తోంది అనగానే సినిమాకు సంబంధించిన టైటిల్ లేదా ఫస్ట్ లుక్ అయ్యి ఉండవచ్చని ఓ వర్గం వారు బాగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ కేవలం హీరోయిన్ మాత్రమే ఖరారయ్యిందని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. మొత్తానికి దీపిక పదుకొనె సెట్టవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయు.


Click it and Unblock the Notifications











