రాజమౌళి-ప్రభాస్ కాంబినేష్ ‘ఛత్రపతి’ రేంజ్ లో రెబల్..!
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఛత్రపతి" చిత్రంలో రెచ్చిపోయి ఎమోషనల్ డైలాగ్స్ తో అలరించిన ప్రభాస్ 'రెబల్" చిత్రంలో మరోసారి రెచ్చిపోయి అదిరిపోయే డైలాగ్స్ తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. రాఘవలారెన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో 'నాకు అమ్మాయిలన్నా, సెల్ ఫోన్ లన్నా ఇష్టంవుండవు. సెల్ ఫోన్ లో మెస్సేజ్ లు ఎక్కువ..అమ్మాయిల్లో డౌట్స్ ఎక్కువ...ఏవీ మనకి సెట్ కాబు, నాకు రామాయణం, మహాభారతాల గురించి తెలయదు. అందులో వుండే యుద్దాల గురించి తెలుసు రండి కుమ్మేసుకుందాం..అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో ఆడియన్స్ లో రెబల్ చిత్రంపై క్రేజ్ ని పెంచేశాడు ప్రభాస్.
ఇందులో ప్రభాస్ కు జోడీగా తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కు ఫాదర్ గా కృష్ణంరాజు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు తొంభై శాతం పూర్తయింది. చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి సంబందించిన యాక్షన్ సన్నివేశాలని ప్రస్తుం హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో టాకీ పూర్తి కానుందట. ఈ చిత్రాన్ని శ్రీ బాలజీ సినీ మీడియా పతాకంపై జె భగవాన్, జె పుల్లారావు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











