Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆదిపురుష్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సీత పాత్రలో బ్యూటీఫుల్ హీరోయిన్
రెబల్ స్టార్ ప్రభాస్ వారుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సినిమా తరువాత మరొక సినిమాను పూర్తి చేయాలని భుజాలపై బాహుబలి కంటే పెద్ద భారాన్ని మోస్తున్నాడు. ఇక మొదటిసారి పూర్తిగా బాలీవుడ్ టెక్నీషియన్స్ తో వర్క్ చేస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ మంగళవారం రానుంది.
రామాయణం కథ ఆధారంగా..
బాలీవుడ్ ఇంటిలిజెంట్ టెక్నీషియన్ ఓం రావత్ అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. రామాయణం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.
సీత పాత్రలో నటించేది ఎవరు
ఈ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి రూమర్స్ భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. రామాయణం స్టోరీ కావడం వలన మరికొన్ని ముఖ్యమైన పాత్రల్లో ఎవరు నటిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సీత పాత్రలో నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బహుశా రేపు ఆ విషయంలోనే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
సీత పాత్రకు ఆమె ఫిక్స్ అయినట్లేనా..?
ఈ పాన్ ఇండియా సినిమాలో సీత లాంటి పాత్ర చేయాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఒక ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. ఇక కృతి సనోన్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మంగళవారం ఉదయం 7:11నిమిషాలకు హీరోయిన్ ఎవరనే విషయంలో పూర్తిగా అలా పోస్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ ఊహాగానాలను ఎంతవరకు నిజం చేస్తుందో చూడాలి.
సినిమా వచ్చేది ఎప్పుడంటే?
ప్రభాస్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. పాత్రలు అన్ని కూడా ఫిక్స్ అయిన తరువాతే రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేస్తారట. ఇక ఇటీవల ప్రభాస్ సలార్ సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ను కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారు.