నా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్లే: ప్రభాస్

By Srikanya

హైదరాబాద్ : ''స్నేహితుల విషయంలో ఆచి తూచి స్పందిస్తా. అందరితోనూ త్వరగా క్లోజ్‌ అవ్వలేను. క్లోజ్‌ అయినవాళ్లందరితోనూ స్నేహం చేయలేను. నా స్నేహితుల్లో బాస్కీ ఒకడు. తనది విజయవాడ. పదో తరగతి వరకూ కలసి చదువుకొన్నాం. ఇప్పుడు నా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసేది తనే. వంశీ, ప్రమోద్‌ మంచి దోస్త్‌లు. వంశీ నేనూ ఒకే కాలేజీలో చదువుకొన్నాం. ఇక ప్రమోద్‌ బంధువుల అబ్బాయి. మేం ముగ్గురం కలసి 'మిర్చి' సినిమా చేశాం. వీళ్లలో ప్రమోద్‌తోనే ఎక్కువ చనువు. చాలా విషయాలు తనతోనే చర్చిస్తా'' అంటున్నారు ప్రభాస్‌. ప్రెండ్షిప్ డే సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.

ప్రస్తుతం...

prabhas about his close friends

ప్రభాస్... బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఓ నటుడికి జీవితంలో ఎప్పుడో కానీ రాని అవకాశం ప్రభాస్‌కు చాలా త్వరగా వచ్చింది. ఆ సినిమా కోసం ఓ నటుడు తన రెండేళ్ల కాలాన్ని వెచ్చించడం సబబే ఆ ఫలితం ఆ రేంజిలో ఉంటుదని అంటున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి ఆ టీమ్‌కు దక్కడం ఖాయం. ప్రభాస్ ఈ ఏడాది ఆ సినిమాతో పాటు 'ఒక్క అడుగు'లోనూ నటిస్తాడు అంటున్నారు...కానీ ఆ మేరకు ఏమీ ఏర్పాట్లు ఏమీ జరగటం లేదు.

బాహుబలిలో ... రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ యుద్ధం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.. 2000 మంది కళాకారులపై చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X