అడ్డంగా బుక్కైపోయిన ప్రభాస్
వరసగా హిట్స్ ఇస్తూ దూసుకుపోతున్న ప్రభాస్ వెళ్ళి వెళ్ళి లారెన్స్ చేతిలో పడ్డాడు.లారెన్స్ తన తాజా చిత్రం కాంచన ప్రమోషన్ లో బిజీగా ఉండటమే కాకుండా ప్రభాస్ ని కూడా లాక్కొచ్చాడు.దాంతో అడ్డంగా బుక్కైపోయిన ప్రభాస్ వెళ్లి 'కాంచన'గురించి మైక్ పట్టుకుని ఇంతవరకూ భారతీయ తెరపై రాని సినిమా 'కాంచన' భజన చెయ్యటం మొదలెట్టాడు.
ప్రభాస్ కాంచన గురించి ఇంకా ఏమన్నాడంటే.."ఈమధ్యే ఈ సినిమా చూశా. మంచి థ్రిల్లింగ్ మాస్ ఎంటర్‌టైనర్.సమాజం వెలేసిన ఓ వర్గం గురించి బాగా చూపించారు లారెన్స్ మాస్టర్. కొత్త ఫీల్‌తో, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం రక్తి కట్టించారు. అందరూ చూడాల్సిన సినిమా. ఫస్టాఫ్ అంతా నాన్‌స్టాప్‌గా నవ్వించే సన్నివేశాలున్నాయి. ఇంటర్వెల్ ముందు షాట్ పెద్ద ఝలక్ అనిపించింది. ఆ తర్వాత సినిమా అంతా థ్రిల్లింగ్‌తో, హారర్ సన్నివేశాలతో కట్టిపడేసింది. పదికి పైగా థ్రిల్లింగ్ సీన్స్ వారెవ్వా అనిపించాయి.
ఫ్లాష్‌బ్యాక్ తర్వాత పతాక సన్నివేశాల్లో వచ్చే పాటలో లారెన్స్ డాన్స్ ప్రదర్శన అత్యద్భుతం. ఆడవేషంలో చూసి లారెన్స్ మాస్టరేనా అన్న సందేహం కూడా ఓసారి వచ్చింది. ఇండియాలోనే ఈ తరహా పాయింట్ టచ్ చేస్తూ ఎవరూ సినిమా తీయలేదేమో! తొలిసారి ఇలాంటి సినిమా చూశా. దీన్ని చూశాక లారెన్స్‌పై గౌరవం మరింత పెరిగింది. శరత్‌కుమార్ సరికొత్త పాత్రలో అలరించారు అని ఆయన చెప్పారు.ఏ సినిమా గురించి పబ్లిక్ గా మాట్లాడని ప్రభాస్ తొలిసారిగా ఇలా భజన ప్రారంభించేసరికి లారెన్స్ సామాన్యుడు కాడు అంటున్నారంతా.


Click it and Unblock the Notifications











