నిర్మాతగా మారిన కృష్ణుడు.. ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’కు ప్రభాస్ సాయం
వినాయకుడు ఫేమ్ కృష్ణుడు అందరికీ గుర్తుండే ఉంటాడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా బాగానే అలరించాడు.ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయక పాత్రలు చేస్తూ వచ్చాడు. అయితే ప్రస్తుతం కృష్ణుడు మరో అవతారం ఎత్తాడు. నటుడిగా, హీరోగా కెరీర్ అంతగా ఊపందుకోకపోవడంతో నిర్మాతగా మారాడు. ఓ కొత్త కథను తెరపై నిర్మించేందుకు సిద్దమయ్యాడు. దీని కోసం ఏకంగా ప్రభాస్‌నే రంగంలోకి దించాడు.
నేడు కృష్ణుడు నిర్మిస్తోన్న మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ సినిమా పోస్టర్, ఫస్ట్ లుక్‌ను ప్రభాస్ చేతుల మీదగా రిలీజ్ చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మేరకు ప్రభాస్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ సినిమాతో కృష్ణుడు నిర్మాతగా మారుతున్నాడని, పెద్ద సక్సెస్ కావాలని నిర్మాతగా మరిన్ని సినిమాలు నిర్మించాలని ప్రభాస్ కోరుకున్నాడు. ఇక ఈ వీడియోను కృష్ణుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్రభాస్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ 'మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్' సినిమా అందరినీ అలరించే ఎంటర్ టైనర్ అవుతుందని తెలిపాడు.. తెలుగు ప్రేక్షకులు నటుడిగా తనన్నెంతో ఆదించారని, నిర్మాతగా తన ప్రయాణాన్ని కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ చిత్రంతో లోతుగడ్డ జయరామ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడని తెలిపాడు.


Click it and Unblock the Notifications











