twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ హీరోని ఉద్దేశించి ప్రభాస్ ఆ కామెంట్?

    By Srikanya
    |

    హైదరాబాద్ : "ఒక సినిమా ఆడినంత మాత్రాన, వరుసగా రెండుమూడేళ్లు హిట్‌లు ఇచ్చినంత మాత్రాన నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నట్టు కాదు. 10-20 ఏళ్ళు కమర్షియల్ సక్సెస్‌తో ఉంటే అప్పుడు నెంబర్‌వన్ అంటారు. అయినా నేనెప్పుడూ నెంబర్ వన్‌గా భావించలేదు. నేనైతే నెంబర్ వన్ కాదు. ఇంకెవరో మీరే ఆలోచించండి అంటూ ప్రభాస్ కుండ బ్రద్దలు కొట్టినట్లు తెలుగులో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం గురించి తేల్చి చెప్పారు. దాంతో ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ప్రబాస్ ఇలా అన్నారనేది చర్చనీయాంసంగా మారింది.

    అలాగే ..నా సినిమా ఎంత వసూలు చేసింది? అనేది నేనూ తెలుసుకొంటా. కానీ పక్కవాళ్ల సినిమాల గురించి ఆలోచించను. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఎక్కడుంది? అనేదే ముఖ్యం. పరాజయాలను తేలిగ్గా తీసుకోను. ఇక నెంబర్‌ వన్‌ అంటారా..? అది ఎలా నిర్ణయిస్తారో నాకు తెలీదు. వరుసగా నాలుగైదు విజయాలు సాధించినా నేను నెంబర్‌ వన్‌ కాదు అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'మిర్చి' విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా గురించి హీరో ప్రభాస్ మీడియాతో ముచ్చటించారు.

    ఇక "బుజ్జిగాడు నుంచి సినిమాల్లో వినోదం పాళ్ళు పెంచాలనుకున్నా. అందుకే ఆ తర్వాత నేను ఎంపిక చేసుకున్న కథలు కూడా అలాంటివే. 'మిర్చి'లో ప్రతి సీన్‌నూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. 'వర్షం' తర్వాత నా సినిమాల్లో అన్ని పాటలు నచ్చింది 'మిర్చి'లోనే. దేవిశ్రీ సంగీతం, మది కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇటలీలో తెరకెక్కించిన యాహూ పాటను డిజిటల్‌లో చిత్రీకరించాం. కాస్ట్యూమ్ డిజైనర్ బాస్కీని కూడా మెచ్చుకుంటున్నారు. ఆర్టిస్టులందరికీ డ్రెస్ డిజైన్ చేసింది అతనే అన్నారు.

    అసలు నా పేరు ముందు 'యంగ్ రెబల్ స్టార్' అని కూడా పెట్టవద్దని చెప్తాను. మూడు నాలుగు సినిమాల వరకు అదంటే ఏంటో కూడా నాకర్థం కాలేదు. సరే ఈ సినిమా ఫ్రెండ్స్‌దే కదా. తీసేద్దాం అని అనుకుంటే ఫ్యాన్స్ ఫీలవుతారని చెప్పారు. ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఏ పనీ చేయను. వాళ్లు చాలా ముఖ్యం. అందుకని వారి కోసం ఉంచేశాను. నాకు మాత్రం ప్రభాస్ అని టైటిల్ కార్డులో పడితే చాలనిపిస్తుంది.'' అని మనస్సులో మాటలు చెప్పుకొచ్చారు.

    English summary
    Prabhas's Says that..."Define No. 1 first. According to me, a No. 1 is someone who stays at the top and rules the industry for 10 – 20 years irrespective of hits or flops. If I or for that matter some other hero gets two or three hits continuously, it can’t be called a number one position. I don’t see myself there now"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X