»   » రానాతో ఆ విషయాలు కూడా, తమన్నా 40 సార్లు : ప్రభాస్

రానాతో ఆ విషయాలు కూడా, తమన్నా 40 సార్లు : ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాకు సంబంధించి బాలీవుడ్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.....అక్కడ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. షూటింగ్ సందర్భంగా తమన్నా, రానాతో కలిసి పని చేసిన అనుభవాలను ప్రభాస్ చెప్పుకొచ్చారు.

తమన్నా గురించి మాట్లాడుతూ... ‘తమన్నా చాలా హార్డ్ వర్కింగ్ గర్ల్. అంతా హార్డ్ వర్క్ చేసే అమ్మాయిని నేనింత వరకు చూడలేదు. మహాబలేశ్వర్‌‌లో ఓ సీన్ షూట్ చేస్తున్నాం. వర్షం పడుతోంది. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల మూప్పై నలభై సార్లు రీటేక్స్ చేసాం. ఆమె అన్ని టేకులు చేసినా సేమ్ ఇంటెన్సిటీతో చేసింది.


Prabhas about Rana and Tamanna

ఈ విషయం గురించి ఆమెతో చెబుతూ.. నీ షూటింగ్ కొన్ని గంటల పాటు చాలా సమయం జరిగింది. తడిచిపోయి ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా సేమ్ ఇంటెన్సిటీతో చేసావు. అలా చేయడం నా వల్ల కూడా కాదు. ఐదారు రీటేక్స్ చేయడగానే నేను అలసి పోతాను' అని చెప్పాను అంటూ తన అనుభవాలను షేర్ చేసుకున్నాడు ప్రభాస్.


రానా గురించి మాట్లాడుతూ...‘మూడో షెడ్యూల్ నుండి రానా, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఎంత క్లోజ్ అయ్యాం అంటే తమ పర్సనల్ విషయాలతో పాటు ఫ్యామిలీ విషయాలు కూడా మాట్లాడుకునే వాళ్లం. నేను అన్ని విషయాలు రానాతో షేర్ చేసుకునేవాన్ని. రానా ఉండబట్టే బాహుబలి షూటింగులో నాకు బోర్ ఫీల్ కాకుండా గడిచిపోయింది' అన్నారు.

English summary
Prabhas has nothing but words of praise for his co-stars in Baahubali, Tamannaah and Rana Daggubati. “Tamannaah is the most hardworking girl I have ever worked with. We shot a scene in Mahabaleshwar in the rain that had 30-40 retakes due to some technical problem.
Please Wait while comments are loading...