విజయ్ దేవరకొండకు సపోర్టుగా... రంగంలోకి ప్రభాస్‌, రౌడీ రిప్లై!

Recommended Video

Taxiwala Issue : Prabhas & Other Heroes Supports Vijay Deverakonda | Filmibeat Telugu

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదల ముందే లీక్ అయిపోవడంతో చిత్ర బృందంలో మనోధైర్యం నింపుతూ పలువురు టాలీవుడ్ స్టార్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

పైరసీని ఎంకరేజ్ చేయొద్దని, అందరూ థియేటర్లలో మాత్రమే 'టాక్సీవాలా' సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంటులో పాల్గొన్న అల్లు అర్జున్ పైరసీ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'టాక్సీవాలా' గురించి స్పందించారు.

పైరసీ గురంచి ప్రభాస్, అభిమానం చాటుకున్న విజయ్!

రేపు ‘టాక్సీవాలా' విడుదలవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండకు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఎవరూ పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అందరూ థియేటర్లలో మాత్రమే చూడాలని ప్రభాస్ పేర్కొన్నారు. దీనికి విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తూ... ‘అన్నా మాకు ముందు సాహో అప్డేట్ ఇవ్వండన్నా' అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

అలా చేయడం సిగ్గు చేటు

విజయ్ దేవరకొండ, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘‘ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే చూడాలని, అలా కాకుండా ఇతర మార్గాల్లో చూస్తే సిగ్గు చేటు , వాళ్ల కష్టానికి కనీసం గౌరవం ఇవ్వండి. పైరసీని ఎంకరేజ్ చేయవద్దు'' అని ట్వీట్ చేశాడు.

వరుణ్ తేజ్ సపోర్ట్

మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ సైతం విజయ్ దేవరకొండకు నైతిక స్థైర్యాన్ని ఇస్తూ ట్వీట్ చేశారు. ‘టాక్సీవాలా' టీంకు బెస్ట్ విషెస్ తెలుపుతూ పైరసీ ఎంకరేజ్ చేయవద్దని కోరారు.

నిఖిల్ మద్దతు

ఇప్పటికే హీరో నిఖిల్ సైతం ‘టాక్సీవాలా' పైరసీకి వ్యతిరేకంగా ఓ వీడియో పోస్టు చేశారు. నిన్న అరవింద సమేతకు జరిగింది, నేడు టాక్సీవాలాకు జరిగింది, రేపు నా సినిమాకు కూడా అలా జరుగవచ్చు. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయవద్దు అని నిఖిల్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X