భయంకరమైన ఆ రాక్షసుడు ఎవరంటే?.. ‘ఆది పురుష్’నుంచి అదిరే అప్‌డేట్!
బాహుబలి సినిమాతో రాజమౌళి.. ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌గా నిలబెట్టాడు. సాహో సినిమాతో ప్రభాస్ తన సత్తాను చాటాడు. కథ వీక్‌గా ఉన్నా, మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ఒంటి చేత్తో తన సినిమాను బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాడు. ఇక ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్‌గా అందరినీ మెప్పించేశాడు. అందుకే ప్రభాస్ తన తదుపరి చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే నాగ్ అశ్విన్, ఓం రావత్ ప్రాజెక్ట్‌లను ఓకే చేశాడు.

చకచకా రెడీ..
సాహో సినిమా తరువాత ప్రభాస్ ప్రేక్షకులకు రాధేశ్యామ్‌తో సర్ ప్రైజ్ ఇవ్వబోతోన్నాడు. అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రాకుండా ఫ్యాన్స్‌ను తెగ ఇబ్బంది పెట్టేసింది. అందుకే అభిమానుల పోరు తట్టుకోలేక టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక రాధేశ్యామ్ అనే టైటిల్ పోస్టర్‌తోనే ఫ్యాన్స్ సంబరపడిపోయారు. కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్.. ఇక త్వరలోనే మొదలుకానుంది.

వరుస ప్రాజెక్ట్స్..
ఓ వైపు రాధేశ్యామ్ కంప్లీట్ కాకపోయినా.. నాగ్ అశ్విన్‌తో ఓ ప్రాజెక్ట్‌ను కన్ఫామ్ చేసేశాడు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్‌ను నాగ్ అశ్విన్ లైటుగా చెబుతూ అంచనాలు పెంచేశాడు. ఈ సినిమా కథను కేవలం ప్రభాస్ మాత్రమే మోయగలడు, ఇది ప్యాన్ వరల్డ్ సినిమా అంటూ నాగ్ అశ్విన్ చెప్పిన మాటలతో అంచనాలు ఆకాశన్నంటాయి.

రాముడి పాత్రలో ప్రభాస్..
ఇక తాజాగా ఆది పురుష్ అంటూ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రభాస్ అనౌన్స్ చేశాడు. తానాజీ అనే చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఓం రావత్.. ప్రభాస్‌ను రాముడిగా చూపించబోతోన్నాడు. ఈ కథను అనుకున్నప్పుడు ప్రభాస్ మైండ్లోకి వచ్చాడని, అతన్ని తప్ప ఇంకెవ్వరినీ ఆ పాత్రలో ఊహించలేమని ఓం రావత్ చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ను ఆకాశానికెత్తేస్తూ డైరెక్టర్ చేసిన కామెంట్స్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

ఫ్యాన్ మేడ్ పోస్టర్..
రాముడి పాత్రలో ప్రభాస్ నటించబోతోన్నాడని టాక్ బయటకు వచ్చాక.. ఫ్యాన్స్ రెచ్చిపోయారు. తమ ప్రతిభకు, ఊహా శక్తికి పదును పెట్టారు. తమ తమ క్రియేటివిటీతో రాముడిగా ప్రభాస్‌ను ఊహించుకున్నారు. ఇలా అందరూ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్‌ను డైరెక్టర్ ఓం రావత్ చూసి మురిసిపోయాడు.
Recommended Video

తెలివైన రాక్షసుడు..
ఏడు వేల సంవత్సరాల క్రితం ఓ తెలివైన రాక్షసుడు ఉన్నాడంటూ ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు రావణుడి పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన వార్తల ప్రకారం రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించబోతోన్నట్టు టాక్ వినిపించిది. మరి ఇది నిజమో కాదో రేపు అందరికీ తెలుస్తుంది. ప్రభాస్‌ను ఢీ కొనడానికి సరైన వాడినే దించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











