Adipurush క్రేజీ ఆఫర్.. ఒక టికెట్‌కు మరొకటి ఫ్రీ.. రిలీజ్ కంటే ముందుగా ఆ వేడుకలో ప్రదర్శన!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదారు చిత్రాలు ఉన్నాయి. అందులో మొదటి నుంచి కొంత ట్రోలింగ్ ఎదుర్కున్న మూవీ ఆదిపురుష్. అయితే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తో ఆ ట్రోలింగ్ కు చెక్ పడింది.
సాహో, రాధేశ్యామ్ వంటి ఓటమి తర్వాత అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు వస్తున్న ప్రభాస్ తొలి మూవీ ఆదిపురుష్. దీంతో ఈ సినిమాపై అంచనాలు హైలో ఉన్నాయి. అయితే ఈ సినిమాను చూసేందుకు ఏ నిర్మాతలు ఇవ్వని బంపర్ ఆఫర్ ఇచ్చారు మేకర్స్.

భారీ బడ్జెట్: గ్లోబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా అలరించేందుకు వస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకులలో విపరీతమైన బజ్‌ని క్రియేట్ చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.

క్రేజీ ఆఫర్: ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ చూసినవారికి అంతకుముందు సినిమాపై ఉన్న నెగెటివిటీ ఒక్కసారిగా తొలగిపోయింది. ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ రిలీజ్ కోసం అటు సినీ ప్రేక్షకులు, ఇటు అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో చిత్ర బృందం ప్రేక్షకులకు క్రేజీ ఆఫర్ ఇచ్చింది.

జూన్ 30 వరకే: ఆదిపురుష్ సినిమాకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పించింది. పేటీఎం ద్వారా ఆ ఛాన్స్ పొందొచ్చని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఇందుకు షరతులు వర్తిస్తాయని, అలాగే ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అనే ఆఫర్ జూన్ 30 వరకే ఉంటుందని పేర్కొంది.

సగానికి తగ్గే ఛాన్స్: ఆఫర్ లో భాగంగా ముందుగా రూ. 100 చెల్లిస్తే ప్రోమో కోడ్ వస్తుందని, టికెట్ బుక్ చేసుకునే ముందు దాన్ని అప్లై చేస్తే రూ. 400 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందని వెల్లడించింది. కనీసం రూ. 350 ధర ఉన్న టికెట్ కే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలుస్తోంది. అంటే రెండు టికెట్స్ బుక్ చేయాల్సి వస్తే ట్యాక్సుతో కలిపి రూ. 700కిపైగా అవుతుంది. అదే పేటీఎం ఆఫర్ కోడ్ ఉపయోగిస్తే సగానికి తగ్గే అవకాశం ఉందని అర్థమవుతోంది.

పాజిటివ్ వైబ్రేషన్స్: అయితే హై బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు ఇలా ఫ్రీగా మరో టికెట్ అందించిన మేకర్స్ పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ రేట్స్ ద్వారా తాము పెట్టిన బడ్జెట్ ను రాబట్టుకోవాలని చూస్తారు. కానీ ఆదిపురుష్ టీమ్ మాత్రం ఇలా ఫ్రీ టికెట్ ఆఫర్ పెట్టడంపై పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి.
న్యూయార్క్ వేదికగా: ఇదిలా ఉంటే జూన్ 16న రిలీజ్ కానున్న ఆదిపురుష్ మూవీని దానికంటే ముందుగా ప్రతిష్టాత్మక ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. న్యూయార్క్ వేదికగా జూన్ 7 నుంచి 18 వరకు జరగనున్న ఆ వేడుకలో ఆదిపురుష్ చిత్రాన్ని జూన్ 13న ప్రదర్శిస్తారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో జూన్ 3న నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











