'ఆదిపురుష్' సీతాదేవి డైలాగ్‌పై వివాదం.. రిలీజ్ చేసేందుకు అభ్యంతరం.. అసలు ఏమైందంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను బాహుబలి మూవీ పాన్ ఇండియా హీరోను చేసింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన క్రేజ్ గురించి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక తర్వాత వచ్చే ఆదిపురుష్ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎంతలా ఆశలు పెట్టుకున్నారో తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ఎట్టకేలకు ఆదిపురుష్ సినిమా విడుదలైంది. కానీ ఒక చోట మాత్రం ఈ సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం అయింది. అసలు ఏమైందనే విషయంలోకి వెళితే..
భారీ అంచనాలు:మహాకావ్యం రామాయణం ఆధారంగా రూపొందిన తాజా సినిమా ఆదిపురుష్. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ నటించగా.. హనుమంతుడి పాత్రలో దేవదత్తా, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ చేశారు. ప్రముఖ హిందీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఎదురుచూపులు:ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ను మొదట్లో ఆదిపురుష్ టీజర్ నిరాశపరిచినా.. ఇటీవల విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆదిపురుష్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకోసం ఆదిపురుష్ రిలీజయ్యే జూన్ 16 కోసం ఎంతగానో ఎదురుచూశారు.
అభ్యంతరం:ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఆదిపురుష్ సినిమా ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. కానీ ఒక్క చోట మాత్రం ఆదిపురుష్ రిలీజ్ కు ఆటంకం ఏర్పడింది. అది ఎక్కడో కాదు నేపాల్ దేశంలో. అందుకు కారణం ఆదిపురుష్ సినిమాలోని ఒకే ఒక్క డైలాగ్. అది కూడా సీతాదేవి ఏ దేశానికి చెందినది అనే విషయంలో నేపాల్ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది.
అసంతృప్తి:అయితే ఆదిపురుష్ సినిమాలో సీతా దేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిపై నేపాల్ సెన్సార్ ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ స్థానికుల నమ్మకం ప్రకారం సీతా దేవి నేపాల్ లో జన్మించిందని. అందుకు విరుద్ధంగా ఇండియాలో సీతా దేవి జననం జరిగిందన్న డైలాగ్ పై వారు అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ డైలాగ్ తొలగించాల్సిందిగా కోరారట.
చివరికీ అలా:నేపాల్ సెన్సార్ బోర్డ్ ఆదిపురుష్ సినిమాను అక్కడ రిలీజ్ చేసేందుకు అంగీకరించలేదట. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ కూడా చేశారట. దీంతో నేపాల్ దేశంలో మూవీ ఎలాగైన రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో చివరికీ ఆ డైలాగ్ ను మేకర్స్ డిలీట్ చేశారట. ఆ కాంట్రవర్సీ డైలాగ్ ను తొలగించి నేపాల్ దేశంలో ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేసినట్లుగా సమాచారం. ఇలా ఆదిపురుష్ కు మొదట్లోనే డైలాగ్ తో వివాదం రావడం హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











