Adipurush Event: ఈ సినిమాకు వర్క్ చేయడం మా అదృష్టం.. జై శ్రీరామ్ సాంగ్ ప్రత్యేకత ఏమిటంటే: మ్యూజిక్ డైరెక్టర్స్

ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సోమవారం రోజు తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా చిన్న జీయర్ స్వామి కూడా రావడంతో వేడుకకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈ వేడుకలో వచ్చిన అతిథులందరూ కూడా ఎంతో పవర్ఫుల్ గా మాట్లాడారు. ఈ సినిమాకు సంగీత ద్వయం అజయ్-అతుల్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.

Adipurush Event:

ఈ వేడుకలో ఈ సంగీత దర్శకులు ఈ విధంగా మాట్లాడారు. అజయ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇలాంటి సినిమాకు మ్యూజిక్ అందించడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇదివరకే దర్శకుడు ఓం రౌత్ సినిమాలకు వర్క్ చేసిన అనుభవం ఎంతో నేర్పింది. ఆయనతో వర్క్ చాలా కొత్తదనాన్ని ఇస్తుంది. అంతే కాకుండా ఎంతో తృప్తిని కూడా కలిగిస్తుంది. ఇక ఆదిపురుష్ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే విధంగా ఉంటుంది. ఈ సినిమాకు వర్క్ చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమా ద్వారా ప్రభాస్ తో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

Adipurush Event:

ఇలాంటి ఆనందాన్ని ఇక్కడ ఈ తిరుపతిలో ఈ అభిమానులతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. మా జీవితం మొత్తంలో కూడా సౌత్ ఇండస్ట్రీలో లైవ్ పెర్ఫార్మ్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఇంత మంచి అభిమానులు ఉన్నందుకు కూడా ఎంతో ఆనంద పడుతున్నాను. మొత్తంగా ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. మేము ఈ సాంగ్స్ కోసం చాలా రోజులు వర్క్ చేశాము. మేము ఇక్కడ వరకు రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. అని అన్నారు.

Adipurush Event:

అజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట కూడా మీ గుండెల్లోకి చేరుతుంది. ముఖ్యంగా జైశ్రీరామ్ పాట మీ మనసులో నుంచి పాడే విధంగా మీకు బలమైమ ఆలోచనను కలిగిస్తుంది..మొత్తం అన్ని పాటలు కూడా ఈరోజు విడుదల కాబోతున్నాయి. ప్రతి ఒక్క పాటను కూడా మీరు ఎంతగానో ఆస్వాదిస్తారు. ఇక ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అజయ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X