రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్.. డేట్ ఫిక్స్ చేసుకున్న దర్శకుడు
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రానున్న రోజుల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ కు మంచి కిక్కివ్వబోతున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన రెబల్ స్టార్ వీలైనంత వరకు వచ్చే ఏడాది నుంచి వెంటవెంటనే రెండు సినిమాలను ప్రేక్షకులకు అందించాలని అనుకుంటున్నాడు.
ప్రస్తుతం సలార్ తో పాటు ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్న ప్రభాస్ సలార్ ఫస్ట్ లుక్ తో బాగానే హైప్ క్రియేట్ చేశాడు. ఇక ఆదిపురుష్ రాముడి లుక్ రావాల్సి ఉంది. ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇక రాముడి పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ పై ఇటీవల చర్చలు జరిపినట్లు సమాచారం. రానున్న ఏప్రిల్ 21న శ్రీరామనవమి సందర్భంగా రాముడి రూపాన్ని చూపిస్తారని తెలుస్తోంది. సినిమాలో రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక సీత పాత్రలో కృతి సనోన్ నటించడానికి రెడీ అయ్యింది. దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాను 2022 ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











