Adipurush: ఆంజనేయుని సీటులో కూర్చున్న వ్యక్తి.. వాళ్ళ రియాక్షన్ కు అందరూ షాక్!
ప్రభాస్ అభిమానులు, రామ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకులు క్యూలు కడుతున్నారు. టికెట్ల కోసం ఎగపడుతున్నారు. చాలా మంది మూవీ చూడటానికి టికెట్స్ దొరకక నిరాశకు గురౌతున్నారు. ఇప్పటి వరకు అయితే మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది.
అయితే, ఈ మూవీ విషయంలో చిత్ర బృందం ఓ కాన్సెప్ట్ ఫాలో అయ్యింది. రాముని కథ ఎక్కడ వినపడినా అక్కడకు ఆంజనేయుడు వచ్చి ఆ కథను వింటాడు, చూస్తాడు అనే నమ్మకం చాలా మంది నమ్ముతుంటారు. ఇప్పుడు ఈ రాముడి కథని కూడా చూడటానికి ఆంజనేయుడు వస్తాడు అని, అందుకోసం ఆయనకు ఓ సీటు వదిలిపెట్టాలని చిత్ర బృందం పేర్కొంది. దానిని అన్ని థియేటర్ యాజమాన్యాలు ఫాలో అవుతూ వచ్చాయి.

ఈ కాన్సెప్ట్ కి ప్రజలు కూడా బాగా కనెక్ట్ అయ్యారనిపిస్తోంది. ఎందుకంటే, తాజాగా ఓ వ్యక్తి భ్రమరాంబ థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చి, హనుమంతుడి కోసం కేటాయించిన సీటులో వచ్చి కూర్చున్నాడు. అంతే, అతనిని తోటి ప్రేక్షకులు చితకబాదారు. అంతేకాదు, అక్కడి నుంచి లేపి, మరో చోట కూర్చోపెట్టారు. అతను కావాలని కూర్చున్నాడో లేక, తెలీక కూర్చున్నాడో తెలీదు కానీ, ప్రేక్షకులు మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారు. ఏకంగా అతనిని కొట్టడం విశేషం.
అంతేకాదు, మూవీ బాలేదు అని చెప్పినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ వద్ద ఓ వ్యక్తి ఆదిపురుష్ మూవీ చూసి బయటకు వచ్చాడు. అతనిని మూవీ ఎలా ఉంది అని కొందరు మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు ఎలా ఉంది అని అడగగా, ఆయన బాలేదు అని చెప్పాడు. అంతే, అది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయి, అతనిని దారుణంగా కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని వినాలో, ఎన్ని చూడాలో. కాగా, ఈ ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సీత గా కృతి సనన్ నటించింది. ఇక రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించడం విశేషం.


Click it and Unblock the Notifications











