Prabhas ఆదిపురుష్ బెనిఫిట్ షోలకు లేని అనుమతి?.. కలెక్షన్లపై అలాంటి ప్రభావం!
రాముడి కథతో రామాయణం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ నటించగా.. హనుమంతుడి పాత్రలో దేవదత్తా, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ చేశారు. ప్రముఖ హిందీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల చేస్తున్నారు. అందుకోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అభిమానులు నిరాశకు గురయ్యే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.
అభిమానులకు నిరాశ: స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా.. బెనిఫిట్ షోలు ఎప్పుడు చూసేద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తుంటారు అభిమానులు. మూవీ రిలీజ్ రోజున వేకువ జామున రెండు, మూడు బెనిఫిట్ షోస్ పడుతుంటాయి. వీటికి ఎక్కువగా అభిమానులే వెళ్తుంటారు. అయితే ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇందులో నిరాశే కలగనుందని టాక్ వినిపిస్తుంది.

రూ. 50 పెంపు: ఆదిపురుష్ సినిమా టికెట్ ధర పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రంలోని థియేటర్లు ప్రస్తుతం సర్కారు నిర్దేశించిన ధరలపై రూ. 50 పెంచుకోవచ్చని జీవీలో పేర్కొంది. మూవీ రిలీజైన రోజు నుంచి 10 రోజుల వరకు టికెట్ ధర రూ. 50 పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
సర్కారుకు రిక్వెస్ట్: ఆదిపురుష్ సినిమాకు అటు తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంచారు. కానీ, బెనిఫిట్ షోలు, తెల్లవారు జామున ప్రదర్శనలపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఆదిపురుష్ బెనిఫిట్ షోలు లేనట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ షోల గురించి ప్రభుత్వం వద్ద పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ అధినేతలు ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం వారి రిక్వెస్ట్ ను సున్నితంగా తిరస్కరించిందట.

భారీగా తగ్గింపు: ఆదిపురుష్ కు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రోజుకి ఐదు షోలు మాత్రమే వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అంటున్నారు. కాబట్టి ఏపీలో విడుదల రోజు తెల్లవారు జామున ఆదిపురుష్ సినిమా చూసే అవకాశం ప్రభాస్ అభిమానులకు లేదని తెలుస్తోంది. దీంతో ఈ ప్రభావం తొలిరోజు కలెక్షన్లపై పడనుంది సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ కెలెక్షన్స్ భారీగా తగ్గుతాయని అంటున్నారు.

అనధికారికంగా ప్రదర్శన: తెలంగాణలోనూ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రోజుకు ఐదు షోలు మాత్రమే వేయనున్నారట. ఇక్కడ కూడా బెనిఫిట్ షోలపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, అనధికారికంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బెనిఫిట్ షోలు నిర్వహించనున్నారని మరో సమాచారం అయితే అందింది. అది ఎక్కడెక్కడా ప్రదర్శిస్తారన్న సమాచారం మాత్రం లేదు.


Click it and Unblock the Notifications











