Prabhas సినిమాకు ఈ కర్మేంటి దేవుడా.. 500 కోట్ల సినిమాను ఎవ్వరు కోనట్లేదా..?

రెబల్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. ఇక అతని నుంచి రాబోయే ప్రాజెక్టులు కూడా ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తాయని అందరూ ఎన్నో అంచనాలు పెంచేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ప్రభాస్ 500 కోట్ల భారీ బడ్జెట్లో తెరపైకి రాబోతున్న సినిమాకు మాత్రం దారుణమైన పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమాను కొనడానికి ఆసక్తి చూపడం లేదు అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

ఆ సినిమా సక్సెస్ ద్వారా..

ఆ సినిమా సక్సెస్ ద్వారా..

నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఎలాంటి సినిమా చేసిన కూడా ఇటీవల కాలంలో అయితే వందల కోట్ల బిజినెస్ అయితే చేస్తున్నాయి. బాహుబలి సినిమా ఏకంగా 2000 కోట్ల బిజినెస్ చేయడంతో ఆ తర్వాత తప్పకుండా ప్రభాస్ అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారుతుంది.

అంచనాలు గట్టిగానే ఉన్నాయి

అంచనాలు గట్టిగానే ఉన్నాయి

ఇంతకుముందు వచ్చిన సాహో సినిమాతో పాటు రాధేశ్యామ్ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆయనప్పటికీ కూడా ప్రభాస్ రేంజ్ అయితే ఏ మాత్రం తగ్గలేదు రాబోయే ప్రాజెక్టులు మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతాయని ఫ్యాన్స్ అయితే ఎంతో నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా సలార్ సినిమాతో పాటు ప్రాజెక్ట్ K పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

 సలార్ తో న్యూ రికార్డ్

సలార్ తో న్యూ రికార్డ్

ప్రస్తుతం తెరకెక్కుతున్న సలార్ సినిమాతో ప్రభాస్ అత్యధిక స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేయబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోయే బిగ్ సినిమాగా సలార్ ఒక సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేయబోతోంది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్క్ అందుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

 మహేష్ సినిమా కూడా..

మహేష్ సినిమా కూడా..

అలాగే తెలుగులో అత్యధిక స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయబోయే సినిమాగా మహేష్ బాబు సినిమా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. సింగిల్ లాంగ్వేజ్ లో చూసుకుంటే ఏ భాషలో కూడా ఇలాంటి రికార్డులు క్రియేట్ కాలేదు అనే విధంగా మహేష్ 28వ సినిమా హైప్ క్రియేట్ చేయబోతోంది. ఈ సినిమా బిజినెస్ తెలుగులోనే దాదాపు 250 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ మార్క్ ను అందుకునే అవకాశం ఉంది.

 అందుకు భిన్నంగా ప్రభాస్ సినిమా

అందుకు భిన్నంగా ప్రభాస్ సినిమా

అయితే ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా బిజినెస్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అసలు ఈ సినిమాకు ఎలాంటి పాజిటివ్ బజ్ క్రియేట్ కాలేదు. అలాగే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడే సినిమాలో గ్రాఫిక్స్ అత్యంత దారుణంగా ఉన్నాయని చిన్న పిల్లల కార్టూన్ గ్రాఫిక్స్ బెటర్ అని దారుణంగా ట్రోల్ అయితే చేశారు.

 కొనేందుకు ఎవరు రావట్లే?

కొనేందుకు ఎవరు రావట్లే?

ఆదిపురుష్ సినిమాను జూన్ 22న విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమా విడుదల తేది దగ్గరపడుతున్న కూడా సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా ముందుకు రావడం లేదట. ఇక చేసేదేమీ లేక చాలా ఏరియాలలో నిర్మాణ సంస్థ టీ సీరీస్ ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ప్రభాస్ సినిమా అంటేనే ఎగబడి కొనుక్కునే వారు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. మరి ఆదిపురుష్ విడుదల తరువాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X