‘ఆదిపురుష్’ ఆరంభం.. నేషనల్ వైడ్‌గా ప్రభాస్ ట్రెండ్
ప్రభాస్ సినిమాలు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్‌తో ప్రభాస్ దుమ్ములేపుతున్నాడు. సింగరేణి బొగ్గు గనుల్లో ప్రభాస్ చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నా కూడా.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాలన్నీ ట్రెండింగ్‌లోనే ఉంటున్నాయి. తాజాగా ఆదిపురుష్ సినిమా నేషనల్ వైడ్‌గా దుమ్ములేపుతోంది.

వరుసగా సినిమాలు..
ప్రస్తుతం ప్రభాస్ జోరు చూస్తుంటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. వరుసబెట్టి సినిమాలను ఓకే చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా అప్డేట్ రాకపోవడంతో అభిమానులు అందరూ కూడా తెగ ఫీలవుతున్నారు.

‘సలార్'తో రచ్చ..
ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌లతో రచ్చ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తోన్నట్టు తెలుస్తోంది. బొగ్గు గనుల్లో యాక్షన్ సీక్వెన్స్‌లతోనే ప్రభాస్ రంగంలోకి దిగాడు. అయితే ఇప్పుడు మరో సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేశాడు.

ఆది పురుష్ ప్రారంభం..
ప్రభాస్ ఆది పురుష్ సినిమాపై గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా, ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న విషయంతెలిసిందే. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పటి నుంచి జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించేశారు.
Recommended Video

అలా ప్రచారం..
అయితే ఆది పురుష్ సినిమాలో సీతగా కృతి సనన్, కౌసల్యగా హేమమాలిని, లక్ష్మణుడిగా సన్నీ సింగ్... రావణాసురుడి కుమారుడు మేఘనాథుడిగా అంగద్ బేడీలు నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











