కాజల్ ని వదలనంటున్న ప్రభాస్...
'డార్లింగ్' చిత్రంలో తన సరసన చేసిన కాజల్ ని కావాలని రికమెండ్ చేసి మరీ ప్రభాస్ తన లేటెస్ట్ చిత్రంలోకి తీసుకున్నారని సమాచారం. దిల్ రాజు నిర్మాతగా దశరధ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరోయిన్ బాగోలేదని షూటింగ్ ఆపుచేసారు. మొదట సమంతాని ఒప్పించారు కానీ ఆమె బిజీగా ఉండటం, ప్రభాస్ సైతం కాజల్ వైపే మ్రొగ్గు చూపటంతో ఈ మార్పు జరిగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ని కూడా ఎంపికచేయాల్సి ఉంది. ఇక కాజల్ మరోసారి రామ్ చరణ్ చిత్రంలోనూ చేయటానికి కమిటయ్యింది. మెరుపు పేరుతో తమిళ దర్శకుడు ధరణి దీనిని రూపొందించనున్నారు. అలా ఒకసారి కాజల్ తో చేస్తే హీరోలు మరోసారి ఆమెతో చేయటానికి ఉత్సాహాన్ని చూపుతారు. ఇక ఎన్టీఆర్ తో కాజల్..బృందావనంలో చేస్తోంది. ఎన్టీఆర్ కూడా కాజల్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.
కాజల్ ప్రభాస్ డార్లింగ్ మెరుపు జూ ఎన్టీఆర్ బృందావనం దిల్ రాజు kajal prabhas darling merupu jr ntr brindavanam ram charan teja magadheera


Click it and Unblock the Notifications