ఫ్లాప్ డైరెక్టర్స్ కి లైఫ్ ఇస్తోన్న ప్రభాస్, అల్లు అర్జున్...!?
ప్రస్తుతం 'బద్రీనాథ్' సినిమా పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తరవాతి సినిమాల గురించి ఆసక్తి కరమైన వార్తలు వినపడుతున్నాయి. బద్రీనాథ్ తరవాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. బద్రినాథ్ విడుదల తరవాత ఈ సినిమా సెట్స్ ఫై కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
ప్లాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దశరథ్ కి దిల్ రాజు మిస్టర్ ఫర్ ఫెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. ప్రభాస్ మాత్రం కేవలం దిల్ రాజుని నమ్మి ఈ సినిమా చేశాడు. దిల్ రాజు ఎక్స్ పెక్ట్ చేసినట్టుగానే మిస్టర్ ఫర్ ఫెక్ట్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలోనే వెళ్తున్నాడు. దిల్ రాజు బేనర్ లో జోష్ వంటి ప్లాప్ సినిమా చేసిన వాసువర్మతో బన్నీ సినిమా చేయబోతున్నాడు. బన్నీ కూడా కేవలం దిల్ రాజుని నమ్మే ఈ సినిమా చేస్తున్నాడు. బద్రినాథ్ తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయ్యే బన్ని సినిమా ఇదే. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.


Click it and Unblock the Notifications











