ప్రభాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీస్‌ కరోనా చెక్.. ఇప్పట్లో తేరుకొనేది కష్టమేనా?

బాహుబలి తర్వాత టాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రాల నిర్మాణం జోరందుకొన్నది. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇతర నటీనటుల చిత్రాలకు హిందీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో ఆ దిశగా నిర్మాతలు చర్యలు చేపట్టారు. అయితే దక్షిణాది చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాల పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మీనా.. ఇన్నేళ్ళయినా అదే అందం.. ఎంత బావుందో (ఫోటో గ్యాలరీ)

 ప్రభాస్ పాన్ ఇండియా వైడ్

ప్రభాస్ పాన్ ఇండియా వైడ్

బాహుబలి, సాహో సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ విస్తృతంగా పెరిగిపోయింది. దీంతో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రాధేశ్యామ్ గానీ, సెట్స్‌పైకి వెళ్లిన సలార్, ఆదిపురుష్ చిత్రాలు, అలాగే షూటింగుకు సిద్ధమైన నాగ్ అశ్విన్ చిత్రాలు కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నాయి.

 వివిధ భాషల్లో స్టైలిష్ స్టార్ మూవీ

వివిధ భాషల్లో స్టైలిష్ స్టార్ మూవీ

ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ కూడా భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలతోపాటు హిందీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనావైరస్ కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదా పడింది.

విజయ్ దేవరకొండ మూవీకి ఇబ్బందులు

విజయ్ దేవరకొండ మూవీకి ఇబ్బందులు

అదే విధంగా టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ కూడా ప్యాన్ ఇండియా చిత్రమే. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తూ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చి దిద్దుతున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

Recommended Video

Adipurush ఛలో హైదరాబాద్, RFC లోనే బెటర్ అన్న Prabhas | Salaar || Filmibeat Telugu
హిందీ సినిమాల రిలీజ్‌లు ప్రశ్నార్థకం

హిందీ సినిమాల రిలీజ్‌లు ప్రశ్నార్థకం

అయితే ఉత్తరాది భారతంలో కరోనావైరస్ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. అనేక హిందీ సినిమాలు రిలీజ్‌కు నోచుకోలేకపోతున్నాయి. అగ్ర హీరోల సినిమా రీలీజ్‌లు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల పరిస్థితి గందరగోళంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X