Project K Realese Postponed: మొదటి రోజే రూ.500 కోట్లు.. సెట్లో విషయాలు లీక్ చేసిన తమ్మారెడ్డి
పాన్ ఇండియా స్టార్ నటిస్తున్న చిత్రం ప్రాజెక్టు కె. ఇప్పటికే ఈ సినిమా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతుండగా.. ఇటీవల కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఇక ఈ సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా పడిందట. ఆ వివరాల్లోకి వెళితే....
సంక్రాంతి టు వేసవి...:నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న చిత్రం ప్రాజెక్టు కె. అయితే ప్రభాస్ హీరోగా... అమితాబ్ బచ్చాన్, కమల్ హాసన్, దీపికా పదుకుణె, దిశాపటానీ వంటి తారలు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కానీ ఈ సంక్రాంతికి ఈ సినిమా రావడం లేదని తెలుస్తోంది. మొన్న కమల్ హాసన్ ఎంట్రీ అప్పుడు కూడా అందులో రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. అంతే కాకుండా అది నిజమేనని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాటలను బట్టి అర్థం అవుతోంది.

మొదటిరోజు 500 కోట్లు..:ప్రాజెక్ట్ కె సినిమా తొలి రోజు 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ అంచనా వేశారు. ఇటీవల ఆయన సినిమా చిత్రీకరణకు వెళ్లి వచ్చారు. ఆ సెట్స్, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న తీరు చూసి ఆశ్చర్యంతో పాటు.. ఆనందానికి గురి అయ్యారట. ప్రాజెక్ట్ కె స్కేల్, కాస్టింగ్ చూస్తుంటే... ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో హాలీవుడ్ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా ఉంటుందని అనిపిస్తుంది. నా అంచనా ప్రకారం ఫస్ట్ డే 500 కోట్లు వస్తాయి. నాకు ఉన్న సమాచారం ప్రకారం... 2024 వేసవికి సినిమా విడుదల అవుతుందని చెప్పుకొచ్చాడు.

రెండు పార్టులుగా..:ఈ సినిమాలో కమల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన హీరోగా రీసెంట్గా విక్రమ్‌తో భారీ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంట్రీతో సినిమాపై భారీ అంఛనాలు అయితే మొదలు అయ్యాయి. ఇప్పటికే 80 శాతం వరకు చిత్రీకరణ పూర్తైనట్లు తెలిసింది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా ఉంటుందని... రెండో భాగంలో కమల్ పాత్ర ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలు వచ్చేఅవకాశం:సంక్రాంతి బరి నుంచి 'ప్రాజెక్ట్ కె' తప్పుకుంటే... మిగతా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. గుంటూరు కారంతో పాటు మాస్ మహారాజ రవితేజ ఈగల్, కమల్ హాసన్ ఇండియన్ 2 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటికి తోడు మరి కొన్ని చిన్న సినిమాలు కూడా వస్తాయి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ సంక్రాంతికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా 'ప్రాజెక్ట్ కె'ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











