బాహుబలి స్ట్రాటజీతో ప్రాజెక్టు కె.. ప్రభాస్, కమల్ ను ఎందుకు టార్గెట్ చేశాడు?

గత కొద్దిరోజులుగా ప్రాజెక్టు K సినిమా అనూహ్యంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా భాగమవుతున్నారనే వార్త అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చలు సోషల్ మీడియాలో మీడియాలో అయితే తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ సబ్జెక్టు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో అనేక సూపర్ హిట్స్ సినిమాలను తెరకెక్కించిన వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని అశ్వీనిదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఇది పాన్ ఇండియా సబ్జెక్టు కాదు... పాన్ వరల్డ్ సబ్జెక్టు అంటూ నాగ్ అశ్వీన్ ట్వీట్లు చేశారు.

Prabhas

అప్పట్లో ట్రోల్స్...
అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో ఆయన మీద ట్రోల్స్ కూడా నడిచాయి. సినిమా మొదలే పెట్టలేదు... ఎందుకంత హడావిడి చేస్తున్నారంటూ ఆయనను అప్పట్లో టార్గెట్ కూడా చేశారు. అయితే సినిమా మొదలుపెట్టడమే కాదు... ఆ తర్వాత ఆయన సినిమా గురించి వెల్లడిస్తున్న వివరాలైతే అందరినీ షాక్ కి గురైచేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపిక పడుకుణె ఎంపిక ఒక కీలక పాత్రలో అమితా బచ్చన్ నటిస్తున్నారు.

రెండు భాగాలుగా..
వీరే కాకుండా దిశా పటానీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా విలన్ పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన ప్రచారాలు కూడా జరుగుతున్నాయి.. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి భాగం చివరిలో ప్రభాస్ విలన్ కలుసుకునేందుకు భవిష్యత్తులోకి వెళతాడని ప్రచారం జరుగుతోంది.

Prabhas

సెకండ్ పార్ట్ లోనే అసలు..
అంటే మొదటి భాగం అంతా ప్రభాస్ చుట్టూనే సినిమా తిరుగుతూ ఉండగా క్లైమాక్స్ లో మాత్రం విలన్ అంటే కమల్ హాసన్ దగ్గరకు వెళ్ళబోతున్నట్లుగా చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఒక రకంగా రెండో భాగంలోనే ప్రభాస్ కమల్ హాసన్ మధ్య అసలైన యుద్ధం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి భాగం చివరిలో ప్రభాస్ కమల్ హాసన్ తో పోటీపడుతున్నాడు అనే విషయాన్ని మాత్రమే రివిల్ చేయబోతున్నారని అసలైన విషయం అంతా రెండో భాగంలో ఉండేలాగా మార్కెటింగ్ స్ట్రాట్ చేయకూడా సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.

Prabhas

బాహుబలి స్ట్రాటజీతో
ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఆ డబ్బులు వెనక్కి రాబెట్టుకోవాలంటే ఇలాంటి స్ట్రాటజీ ఏదో ఒకటి వర్కౌట్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకరకంగా బాహుబలి సినిమాలో కూడా ఇలాగే కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనే ఒక ఏకైక ప్రశ్నను ఆధారంగా చేసుకుని వందల కోట్ల రూపాయలను రాజమౌళి సంపాదించారు. బహుశా అదే స్ట్రాటజీని ప్రాజెక్టుకి టీం కూడా ఫాలో అవుతుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X