బ్రేకింగ్: ప్రభాస్‌తో కళ్లు చెదిరే ప్యాన్ ఇండియా మూవీ.. దర్శక, నిర్మాతలు ఎవరంటే?
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మరో సంచలనానికి తెర తీయబోతున్నారు. లాక్‌డౌన్‌లో క్రేజీ ప్రాజెక్టులను ఇప్పటికే ప్లాన్ చేసుకొంటున్న ప్రభాస్ మంగళవారం తన తదుపరి ప్రాజెక్ట్‌పై సంచలన ప్రకటన చేయబోతున్నట్టు తెలిసింది. ఇందుకోసం ప్రభాస్ మంగళవారం ఉదయం తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో లైవ్ ద్వారా తన ప్రాజెక్టు వివరాలను ప్రకటించనున్నట్టు సమాచారం. ఆ ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే..

వరుస ప్రాజెక్టులతో
ప్రభాస్ ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్గే హీరోయిన్‌గా రాధేశ్యామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో షూటింగ్ నిలిచిపోయింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా భారీ సెట్ వేసి హైదరాబాద్‌లోనే షూటింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

నాగ్ అశ్విన్‌తో ప్యాన్ వరల్డ్ మూవీ
ఇదే ఊపులో మహానటి ఫేం నాగ్ అశ్విన్‌తో కలిసి మరో ప్రాజెక్టును చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకోన్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ చిత్రం ప్యాన్ ఇండియాను మించి.. ప్యాన్ వరల్డ్ మూవీ రేంజ్‌లో చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇంకా స్క్రిప్టు దశలోనే ఉండటం గమనార్హం.

సాహో తర్వాత భారీ గ్యాప్
సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. అయితే లాక్ డౌన్ కారణంగా ఆయన సినిమా రిలీజ్ విషయంలో భారీ గ్యాప్ వచ్చింది. అయితే ఇక అలాంటి గ్యాప్‌ను ఇకముందు ఉండకుండా చూసుకొంటున్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే లాక్‌డౌన్ భారీ ప్లానింగ్‌కు తెరలేపినట్టు సమాచారం.

బాలీవుడ్‌లో నేరుగా ఎంట్రీ
ఇక ఆ క్రమంలోనే స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి భూషన్ కుమార్, కిషన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ సినిమా టీ సీరిస్ బ్యానర్‌పై తెరకెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను ఆగస్టు 18న వెల్లడించే అవకాశం ఉంది. ఈ మేరకు ఓం రావత్‌తో చిన్న వీడియోను రిలీజ్ చేసి ఆసక్తిని రాజేశారు.
Recommended Video

తానాజీ ఫేం దర్శకుడు ఓం రావత్‌తో మూవీ
ఇక ఓం రావత్ విషయానికి వస్తే.. ఇటీవల బాలీవుడ్‌లో తానాజీ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకత్వ శాఖలోకి ప్రవేశించడానికి ముందు రావత్ కరామతి కోట్ అనే హిందీ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా ప్రవేశించారు. సిటీ ఆఫ్ గోల్డ్, హాంటెడ్ 3డీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్ చిత్రానికి దర్శకత్వం వహించారు. తానాజీ చిత్రంతో భారీ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











