ఆదిపురుష్: సరికొత్త అవతారంలో ప్రభాస్.. ఆ పోస్టర్ చూస్తే మతిపోవాల్సిందే!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ అనుకున్నట్లుగానే మరో మంచి ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు. బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ టి సిరీస్ రెట్రో ఫైల్స్ ప్రొడక్షన్ తో కలిసి నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గత వారం నుంచి రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఉదయమే సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకి ఆదిపురుష్ అనే టైటిల్ ని సెట్ చేశారు.

చెడుపై మంచి సాధించిన విజయం
వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ అభిమానులకు మరో మంచి కిక్కిచ్చాడనే చెప్పాలి. ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా మైథలజికల్ జనర్ లో లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయం అనే ట్యాగ్ లైన్ కూడా ఆకట్టుకుంటోంది. కేవలం టైటిల్ ని ఎనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఒక్కసారిగా అంచనాల డోస్ ని పెంచేసింది. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బడా ప్రాజెక్టు హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో భారీగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

రాముడిగ అవతారంలో ప్రభాస్
ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ఒక క్లారీటి అయితే వచ్చేసింది. ఆదిపురుష్ అనే అవతారం ఆధారంగా సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా తరువాత అంతకంటే హై రేంజ్ లో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ఒక వివరణ ఇచ్చింది. ఓం రావత్ అయితే ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో న్యూస్ వైరల్ గా మారింది.

అంతకు మించి అనేలా.. ఆదిపురుష్
ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ కథలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ లో రూపొందుతున్న ఆ సినిమా కూడా భారీ స్థాయిలో రూపొందనుంది. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ఆది పురుష్ అనే మరో పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టాడు. ఇక ఈ సినిమాపై అంచనాలు మాత్రం మామూలుగా ఉండవని చెప్పవచ్చు.
Recommended Video

బడ్జెట్ ఎంత ఉంటుందో?
అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు నాగ్ అశ్విన్ సినిమాతో బిజీగా ఉంటూనే ప్రభాస్ ఈ సినిమాను కూడా పట్టాలెక్కిస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది. కానీ మైథలజికల్ సినిమా కాబట్టి ఒకేసారి రెండు ప్రాజెక్టులు అంటే చాలా కష్టమైన పని. ఇక సినిమా బడ్జెట్ 500కోట్ల వరకు ఉంటుందని బాలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











