twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ పుట్టినరోజున మరో కిక్కిచ్చే అప్డేట్.. అభిమానుల కోసం రెబల్ స్టార్ నెవర్ బిఫోర్ ప్లాన్స్!

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కోసం అభిమానులు ఈ సారి మునుపటి కంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా మూడు సినిమాలను లైన్ లోకి తెచ్చాడు. దీంతో ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పుట్టినరోజు నాడు ఎదో ఒక విధంగా సర్ ప్రైజ్ ఇస్తారని చెప్పవచ్చు. అయితే సినిమాల అప్డేట్స్ అనే కాకుండా ఒక కొత్త ప్రాజెక్టుపై కూడా అదే రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    రాదేశ్యామ్ టీజర్ అయితే సెట్టయ్యింది..

    రాదేశ్యామ్ టీజర్ అయితే సెట్టయ్యింది..

    అక్టోబర్ 23న ప్రభాస్ 41వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు. రాధేశ్యామ్ షూటింగ్ కోసం ప్రభాస్ ఇటీవల ఇటలీ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోనున్న రెబల్ స్టార్ అభిమాబులకు కూడా ఊహించని సర్ ప్రైజ్ లు ఇస్తాడాని తెలుస్తోంది. ఇప్పటికే రాధేశ్యామ్ కి సంబంధించిన ఒక టీజర్ అయితే సిద్ధమైనట్లు తెలుస్తోంది.

    ఆ ఎఫెక్ట్ మళ్ళీ పడకూడదు అంటే..

    ఆ ఎఫెక్ట్ మళ్ళీ పడకూడదు అంటే..

    గత ఏడాది మాదిరిగా ఈ సారి పుట్టినరోజుకు పోస్టర్ తో సరిపెడితే అభిమానుల ఆవేశాన్ని తట్టుకోవడం కష్టమే అవుతుంది. అప్డేట్స్ ఇవ్వడం లేదని అప్పట్లో యూవీ క్రియేషన్స్ ని బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో ఏకంగా ఒక ఉద్యమమే నడిపించారు. ఆ ఎఫెక్ట్ మళ్ళీ పడకూడదు అంటే ఈ సారి అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఒక టీజర్ ఇవ్వాల్సిందే.. అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

     మరో కొత్త ప్రాజెక్టుపై చర్చలు

    మరో కొత్త ప్రాజెక్టుపై చర్చలు

    అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఆదిపురుష్ కి సంబంధించిన హీరోయిన్ పాత్రపై కూడా అదే రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఫైనల్ గా రెబల్ స్టార్ మరో కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు బలమైన టాక్ నడుస్తోంది. గత కొన్ని రోజులుగా అదే విషయంపై చర్చలు కూడా నడుస్తున్నాయట.

    Recommended Video

    Prabhas Adopts Forest Land ప్రభాస్ భారీ విరాళం | Green Revolution
    KGF దర్శకుడితో న్యూ మూవీ..

    KGF దర్శకుడితో న్యూ మూవీ..

    KGF సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్న ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ తో అంతకంటే హై రేంజ్ లో క్రేజ్ అందుకునే అవకాశం ఉందట. ఇక ఆ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ హీరోలపై కన్నేసిన ప్రశాంత్ ప్రభాస్ తో కూడా ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ కాంబినేషన్ పై కూడా 23వ తేదీన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విధంగా ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా అభిమానులకు ఒక మంచి కిక్కివ్వనున్నట్లు అర్ధమవుతోంది.

    English summary
    The much awaited Prabhas 20th movie First Look has finally been released. UV Creations, which has been making fans a little impatient for years due to delays, got a good kick out of the whole first look. The title of Radheshyam has been fixed for the movie as everyone expected. The First Look title is currently trending on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X